Rakul Preet Singh: తెలుగులో వరుసగా 8 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఎవరంటే..

Rakul Preet Singh:
చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్గా రాణించాలని ఎన్నో కళలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం దక్కాలని కూడా చాలామంది భామలు ఆశ పడుతూ ఉంటారు.
సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే స్టార్ హీరోల సినిమాలలో నటించే అదృష్టం కలుగుతుంది. మరి కొంతమంది భామలు చేసింది తక్కువ సినిమాలే అయిన బాగా పాపులర్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది హీరోయిన్లు అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీలో కనుమరుగైపోతున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్లు గా రాణించిన చాలామంది హీరోయిన్లు ఆ తర్వాత కనిపించకుండా మాయమవుతున్నారు. తోపు హీరోయిన్స్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న చాలా మంది ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది యంగ్ హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీగా ఉంటున్నారు. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో చాలామంది సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. మరి కొంతమంది ముద్దుగుమ్మలు బిజినెస్ లో రాణిస్తున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా టాలీవుడ్ లో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ అంబడి చేతుల్లో సినిమాలు లేక సైలెంట్ అయిపోయింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ 18 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కానీ వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో ప్రస్తుతం ఆఫర్స్ అందుకోలేక పోతుంది ఈ బ్యూటీ. ఈ హీరోయిన్ ఎవరంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.
తన అందంతో, నటనతో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. 18 ఏళ్ల చిన్న వయసులో రకుల్ ప్రీత్ సింగ్ కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలో తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత 2009లో కన్నడ సినిమా గిల్లి తో హీరోయిన్గా పరిచయం అయ్యింది. 2011లో రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాలో సిద్ధార్థ రాజకుమార్ జోడిగా నటించింది. ఈ సినిమా తమిళ్తోపాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది.
ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత జాతి భగ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ షోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగులో ఈ భామ సినిమాలను తగ్గించింది. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చివరి ఎనిమిది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందాయి. దాంతో ఈమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే పనిలో ఉంది. అలాగే హిందీలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంది.