Kaviya Maran : కావ్య మారన్ ఇంట్లో కుమ్ములాట..మార్కెట్లో భూకంపం.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం

Kaviya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తండ్రి సన్ టీవీ నెట్వర్క్ అధినేత కలానిధి మారన్‌కు బుధవారం ఉదయం ఒక పెద్ద షాక్ తగిలింది. ఆయన కంపెనీ సన్ టీవీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఆ షేర్లలో డబ్బులు పెట్టిన వాళ్ళందరికీ భారీ నష్టం వచ్చిందట. అసలు ఈ షాక్ ఎందుకు తగిలిందంటే, కలానిధి మారన్, ఆయన తమ్ముడు దయానిధి మారన్ మధ్య ఏదో లీగల్ గొడవ నడుస్తుందని వార్తలు వచ్చాయి.
కలానిధి మారన్, దయానిధి మారన్ మధ్య కోర్టులో గొడవ నడుస్తోంది. దీని ప్రభావం నేరుగా సన్ టీవీ షేర్లపై పడింది. నిన్న ఉదయం మార్కెట్ తెరుచుకోగానే సన్ టీవీ స్టాక్ పడిపోవడం మొదలైంది. బీఎస్ఈలో ఏకంగా 5% వరకు పడిపోయింది. దాంతో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ కంగారు పడ్డారు. ఉదయం 10 గంటలకల్లా షేరు 4 శాతం వరకు పడిపోయి, రూ.592.40 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ పతనం వల్ల కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ.23.35 వేల కోట్ల వరకు పడిపోయిందట.
Read Also:Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్
మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ షేర్ పతనం వల్ల సన్ టీవీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కోట్ల రూపాయల్లో నష్టం వచ్చింది. గత కొంతకాలంగా ఈ షేరు బాగానే పెరుగుతోంది. కానీ, ఈ కుటుంబ గొడవ వార్త రాగానే మార్కెట్ వాళ్ళ అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చేసుకుంది.
కలానిధి మారన్ అంటే ఇండియాలో మీడియా రంగంలో ఒక పెద్ద పేరు. ఆయన సన్ టీవీ నెట్వర్క్కి యజమాని. అంతేకాదు, ఐపీఎల్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు పోటీగా ఉండే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కంపెనీకి కూడా ఆయనే ఓనర్. ఆయన కూతురు కావ్యా మారన్ ఐపీఎల్ మ్యాచ్‌లప్పుడు స్టేడియంలో కనిపిస్తూ, ఆమె రియాక్షన్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది కదా.
Read Also:Viral Video: బుర్జ్ ఖలీఫాపై గర్బా ప్రదర్శన.. నెటిజన్లు ట్రోలింగ్.. కారణమిదే?
ఈ కుటుంబ గొడవ కనుక ఇంకా ఎక్కువ కాలం నడిస్తే, అది కంపెనీ పేరు మీద, అలాగే పెట్టుబడిదారుల నమ్మకం మీద కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ గొడవ గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.