Viral Video: బుర్జ్ ఖలీఫాపై గర్బా ప్రదర్శన.. నెటిజన్లు ట్రోలింగ్.. కారణమిదే?

Viral Video: దేశ సంస్కృతిపై ప్రతీ భారతీయుడికి గౌరవం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత సంప్రదాయాలను నేలమట్టం చేయరు. అలా చేసే వారిని కూడా సపోర్ట్ చేయరు. తినే ఫుడ్ సంస్కృతి అయినా, ధరించినా దుస్తులు లేదా నృత్యం అయినా కూడా భారతీయులు ఎంతో గౌరవిస్తారు. అయితే దేశంలో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నృత్యాలు చేస్తూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే దుబాయ్‌లో భారత సంస్కృతికి సంబంధించిన ఓ వీడియోను వైరల్ అవుతోంది. దుబాయ్ ఐకానిక్ బుర్జ్ ఖలీఫాకు వెళ్లిన వారు అక్కడ గర్బా ప్రదర్శించారు. అయితే ఇలా గర్భా డ్యాన్స్‌ను ప్రదర్శించడంతో కొత్త వివాదం చెలరేగింది. కొంతమంది బహిరంగంగా నృత్యం చేయడం తప్పు అని భారతీయులను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఇది కామన్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ గర్భా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
దుబాయ్ చూడటానికి వెళ్లిన కొందరు భారతీయులు బుర్జ్ ఖలీఫాను సందర్శించారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫాను చూడటానికి ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భారతీయులు అక్కడికి వెళ్లి గర్బా నృత్యం కూడా చేశారు. ఈ వీడియో క్లిప్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. ప్రపంచ నిర్మాణ స్మారక చిహ్నాన్ని డ్యాన్స్ ఫ్లోర్గా మార్చడం సరికాదని కొందరు నెటిజన్లు అంటున్నారు. భారతీయ సంస్కృతి డ్యాన్స్‌ను ఇలా చేయకూడదని అంటున్నారు. ఎందుకంటే ఒక బహిరంగ ప్రదేశంలో ఇలా డ్యాన్స్ వేయడం ఏంటని మండిపడుతున్నారు. పవిత్రమైన గర్భా డ్యాన్స్‌ను ఇలా అపవిత్రం చేస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే మరొకరు ఇలా బహిరంగంగా గర్భా డ్యాన్స్ వేయడం తప్పు కాదని అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో ఒకోక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. గర్భా డ్యాన్స్ మాత్రమే వేశారు.. అంతే కానీ దాన్ని దారుణంగా ఏం వేయలేదని అంటున్నారు. అయితే మీకు ఈ వీడియోపై ఏం అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
ఇది కూడా చూడండి: Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు