Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ

Kubera Full movie review: దర్శకుడు శేఖర్ కమ్ముల వైవిధ్యమైన కథలతో సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ సినిమాలు ఇతని లిస్ట్‌లో ఉన్నాయి. అయితే తాజాగా తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్, నాగార్జున, రష్మిక మందానాతో కుబేర మూవీ తీశారు. ఈ మూవీ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటి? సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? అనే పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఓసారి మూవీ రివ్యూపై లుక్కేయండి.
కథ
సినిమా కథ విషయానికి వస్తే దీపక్ (నాగార్జున) అనే ఎక్స్ సీబీఐ ఆఫీసర్ ఉంటాడు. తాను ఒక ఆపరేషన్‌లో దేవా (ధనుష్) అనే ఒక బిచ్చగాడితో కలిసి చేస్తాడు. అయితే దేవా వల్ల దీపక్‌కు ఎలాంటి సమస్య వస్తుంది? దీపక్ ఎందుకు ఈ ఆపరేషన్ తీసుకున్నాడు? దాని కోసం దేవాను ఎందుకు ఎంచుకున్నాడు? అనేది సినిమా స్టోరీ. మీకు ఈ మూవీ స్టోరీ తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
శేఖర్ కమ్ముల సినిమా విషయంలో ఎంచుకున్న పాయింట్ బాగుంది. అలాగే తాను ఎంచుకున్న ఆ పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నంలో విన్ అయ్యాడు. నిజానికి సినిమా ప్రారంభంలోనే మొత్తం స్టోరీ ఏంటని అర్థం అవుతుంది. అయితే ప్రేక్షకులకు ఎలాంటి బోరింగ్ లేకుండా రెండున్నర గంటల పాటు సినిమాను డైరెక్టర్ ఎంగేజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో ధనుష్ పాత్ర చాలా ముఖ్యం. తన యాక్టింగ్ అయితే అదుర్స్. వేరే హీరో అయితే ఇంత బాగా చేయలేడు ఏమో అనిపించేలా ధనుష్ యాక్టింగ్ చేశాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను సరిగ్గా శేఖర్ కమ్ముల చెప్పే ప్రయత్నం చేశాడనే చెప్పవచ్చు.
ఎలా ఉందంటే?
ఫస్టాఫ్ బాగానే ఉన్నా కొన్ని సందర్భాల్లో స్లో నరేషన్ అనిపిస్తుంది. సెకాండాఫ్‌లో అయితే స్టోరీ మొత్తం ధనుష్ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే డైలాగ్‌లు సూపర్‌గా ఉన్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాకు మ్యూజిక్ ప్లస్ అని చెప్పవచ్చు. నాగార్జున కూడా ఈ సినిమాలో బాగా నటించాడు. నాగార్జున, ధనుష్, రష్మికా యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉన్నాయి. కాకపోతే సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకు మొత్తం స్టోరీ చెప్పడమే మూవీకి కాస్త మైనస్ అని చెప్పవచ్చు. ఇలా కాకుండా కాస్త సీన్లు మార్చి ఉంటే బాగుండేది. దీనివల్ల ప్రేక్షకులకు ఇంకా సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సినిమాపై బోరింగ్‌గా ఉండకుండా ఉంటుంది. అయితే సినిమాలో విలన్ పాత్ర కూడా పెద్దగా లేదు. మొదట్లో కాస్త విలన్‌గా కనిపించినా తర్వాత పాత్రలో అంత లేదు. విలన్‌ను కాస్త చక్కగా తీర్చిదిద్దితే బాగుండేది. అయితే సినిమా మొత్తం ఒకే పాయింట్. దీనివల్ల కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా బిచ్చగాడి క్యారెక్టర్‌లో ధనుష్ సూపర్‌గా నటించాడు. ధనుష్ చేసిన సినిమాల్లో ఈ పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ మూవీలో ధనుష్ నటనటకు అవార్డు కూడా వస్తుందనేలా యాక్టింగ్ చేశాడు. శేఖర్ కమ్ముల రాసిన విధంగా యాక్టింగ్ చేశాడు. నాగార్జున, రష్మిగా మందాన్నా అయితే వారి పాత్రలకు న్యాయం చేశాడు. నాగార్జున మంచి పాత్రలో నటించాడని చెప్పవచ్చు.
టెక్నికల్ అంశాలు
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ బాగుంది. సినిమాకి బాగా హైలైట్ గా నిలిచాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తం మీద సినిమా సాంకేతిక పరంగా బాగుంది. సినిమాటోగ్రాఫీ కూడా బాగుంది.
ప్లస్ పాయింట్స్
ధనుష్, నాగార్జున యాక్టింగ్
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
కొన్ని సన్నివేశాలు
బోరింగ్ సీన్స్
రేటింగ్
2.5/5
Also read : Kubera Twitter Review: కుబేర ట్విట్టర్ రివ్యూ!
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
-
Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం