Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు

Rashmika : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే షూటింగ్ కోసం నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలని కోరడం ఇటీవల కాలంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పిన కారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమా ఆఫర్‌ను కోల్పోయింది. ఇప్పుడు రష్మిక మందన్న ఈ విషయంపై మాట్లాడింది. ఆమె ఇంతకు ముందు సందీప్ వంగతో యానిమల్ అనే సినిమాలో పనిచేసింది. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలో పని చేయడం ఈజీ అనే అర్థంలో రష్మిక మందన్న మాట్లాడింది.
రష్మిక మాట్లాడుతూ.. “నేను కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో పనిచేశాను. అక్కడ పని ఒక ఆఫీసు టైమింగ్స్లాగే ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు షూటింగ్ చేస్తే సరిపోతుంది. షూట్ తర్వాత కుటుంబంతో గడపవచ్చు, నిద్రపోవచ్చు. కానీ, హిందీలో అలా కాదు. అక్కడ 12 గంటల షిఫ్ట్. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు పని చేయాలి. నాకు రెండూ ఇష్టమే. సినిమా ఏమి అడుగుతుందో, అది చేస్తాను” అని ఆమె చెప్పింది.
Read Also:Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
“ఈ పని గంటల గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రతి సినిమా ప్రారంభానికి ముందు నటీనటులు ఈ విషయం గురించి టీమ్‌తో మాట్లాడాలి. ఎన్ని గంటలు షూట్ ఉంటుంది. ఏ సమయంలో షూట్ చేయాలి అనే విషయాలను చర్చించుకోవాలి. కొన్నిసార్లు ఉదయం 9 గంటలకు షూట్ ప్రారంభమై 9 గంటలకు ముగియాల్సి ఉంటుంది. కానీ, అది మరుసటి రోజు వరకు కొనసాగుతుంది. దీని ద్వారా 36 గంటలు, 48 గంటలు నిద్ర లేకుండా పని చేయాల్సి వస్తుంది. సినిమా షూటింగ్లో ఇలా జరగడం కామన్” అని రష్మిక తెలిపింది.
అలాగే పనిచేసే విషయంలో అందరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అది సరైనదే. మీరు మీ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఇది నేను పని చేయాలనుకుంటున్న టైం లిమిట్ ఇలా మనం చేయొచ్చా అని అడగడం న్యాయమే అది వారి పర్సనల్ విషయం అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో 2-3 రోజులు నిద్ర లేకుండా పని చేయాల్సిన అవసరం దాని సిచ్యుయేషన్ బట్టి వస్తుందని ఆమె చెప్పింది.
Read Also:Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Nayanthara : ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ కు అంతకోపమెందుకు ?
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు