Nayanthara : ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ కు అంతకోపమెందుకు ?

Nayanthara : సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు ఈ మధ్య హిందీలో కూడా నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార, సౌత్ లోని చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. తన క్రమశిక్షణ, ఎలాంటి భయం లేకుండా అభిప్రాయాలు చెప్పే నయన్‌కు మంచి పేరు ఉంది. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్టార్ హీరో పక్కన సినిమాలో నటించడం తను చేసిన పెద్ద తప్పు అని నయనతార చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నయనతార ‘గజిని’ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. అయినా కూడా, ‘గజిని’ సినిమాలో నటించడం నయనతారకు అస్సలు నచ్చలేదట. దీనికి కారణాన్ని నయనతార ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పింది. “గజిని సినిమాలో నటించడం నా కెరీర్‌లో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం. ఆ సినిమాలో నా పాత్ర చాలా చెత్తగా ఉంది. షూటింగ్‌కి ముందు నాకు చెప్పినట్లుగా ఆ పాత్రను చూపించలేదు. నన్ను ఆ సినిమాలో చాలా దారుణంగా చూపించారు. కానీ అప్పుడు నేను ఆ విషయం గురించి మాట్లాడలేదు. అది వృత్తిపరంగా సరికాదు అని ఊరుకున్నాను. కానీ నేను ఆ సినిమాను అస్సలు ఒప్పుకోకుండా ఉండాల్సింది.” అని నయనతార చెప్పింది.
Read Also:MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
‘గజిని’ సినిమాలో నయనతార సెకండ్ హీరోయిన్ గా నటించింది. మొదటి హీరోయిన్ అసిన్. సినిమాలో నయనతార పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ అసిన్ పాత్రే సినిమాకు రియల్ హీరోయిన్‌గా నిలిచింది. బహుశా నయనతారకు ఇది నచ్చలేదనిపిస్తుంది. గతంలో రజనీకాంత్ నటించిన ‘కథానాయకుడు’ సినిమాలో వేరే హీరోయిన్ ఒక పాటలో నటించిందని, నయనతార ఆ పాటనే కట్ చేయించిందని చెబుతారు. తన పాత్ర కంటే మరో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటే నయనతార దాన్ని అస్సలు సహించదు. ‘చంద్రముఖి’ సినిమా సమయంలో కూడా నయనతార అసంతృప్తి వ్యక్తం చేసిందట.
మురుగదాస్ స్పందన
‘గజిని’ సినిమాను ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేశారు. నయనతార వ్యాఖ్యలపై మురుగదాస్ స్పందిస్తూ, “కొన్నిసార్లు మనం ఇష్టపడే నటీనటులకు చిన్న రోల్స్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనకు అంత సన్నిహితం కాని నటులకు పెద్ద పాత్రలు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా సాధారణమే” అని చెప్పారు. ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘దర్బార్’ సినిమాలో నయనతార మళ్ళీ నటించింది.
Read Also:Financial Freedom:నెలాఖరున డబ్బుల్లేక ఇబ్బందా? ధనవంతులు కావాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Actor Srikanth : మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ హీరో, నటులు.
-
Aamir Khan : కేవలం 8 నిమిషాలకే రూ. 30 కోట్లు..రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ కామియోరోల్
-
Nayanthara: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!
-
Kollywood: తమిళంలో హిట్… తెలుగులో ఫ్లాప్.. అసలు కోలివుడ్‌కి ఏమైంది?