Aamir Khan : కేవలం 8 నిమిషాలకే రూ. 30 కోట్లు..రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ కామియోరోల్

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ త్వరలో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన చివరి సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఫ్లాప్ అయిన తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఆమిర్ బిజీగా ఉన్నారు. ఈ లోగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో కూడా కనిపించనున్నారు. ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. అదే రోజున హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమాతో ఇది పోటీపడనుంది. ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ ఎక్స్టెండెడ్ క్యామియోలో కనిపించనున్నారని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సినిమాలో ఎంతసేపు కనిపిస్తారనే విషయం తెలిసిపోయింది.
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు భారీ పారితోషకాలు ముట్టినట్లు వార్తలు గుప్పుముంటున్నాయి. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.280 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది ఆయన గత సినిమాలతో పోలిస్తే చాలా ఎక్కువ. మొత్తం సినిమా బడ్జెట్ రూ.400 కోట్లు అని సమాచారం. ఇక ఆమిర్ ఖాన్, తన క్యామియో రోల్ కోసం రూ.25-30 కోట్లు ఛార్జ్ చేశారని చెబుతున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఆమిర్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే తన భాగానికి సంబంధించిన షూటింగ్‌ను చాలా కాలం క్రితమే పూర్తి చేసుకున్నారు. సినిమాలో, ఆమిర్ ఖాన్ సినిమా క్లైమాక్స్ కు కొద్దిసేపు ముందు మాత్రమే తెరపై కనిపిస్తారట. ఆమిర్ ఖాన్‌కు ఈ సినిమాలో కేవలం 8 నిమిషాల స్క్రీన్ టైమ్ మాత్రమే లభించిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఈ పాత్ర సినిమా కథలో చాలా ప్రభావాన్ని చూపుతుందని, భవిష్యత్తులో సినిమా ఫ్రాంచైజీని విస్తరించడానికి కూడా సాయపడుతుందని చెబుతున్నారు.
ఆమిర్ ఖాన్, రజనీకాంత్ ఒకేసారి తెరపై కనిపించడం ఇదే మొదటిసారి. దీనితో సౌత్, బాలీవుడ్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా చిత్రం. కేవలం 8 నిమిషాల స్క్రీన్ టైమ్ కోసం ఆమిర్ ఖాన్ రూ.30 కోట్లు వసూలు చేస్తున్నట్లయితే ఆయనకు ఇది నిజంగానే చాలా మంచి డీల్ అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆమిర్ ఖాన్ తదుపరి ప్రాజెక్ట్స్
ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సితారే జమీన్ పర్’ తర్వాత ఆ సినిమా పనులు మొదలుపెడతానని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతేకాదు, ఈ సినిమాలో ఆయన శ్రీకృష్ణుడి పాత్రలో నటించవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అల్లు అర్జున్‌తో కలిసి ఆమిర్ ఖాన్ దిగిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమిర్ ఖాన్ అల్లు అర్జున్ సినిమాలో కనిపించవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి.
-
War 2 Telugu Pre-Release Event: వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సితార ఎంటర్ టైన్ మెంట్స్ క్లారిటీ
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rajinikanth : హీరోయిన్లతో రొమాన్స్ చేయను.. రజనీకాంత్ సంచలన నిర్ణయం
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Nayanthara : ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ కు అంతకోపమెందుకు ?