Kaleshwaram Commission shocks Revanth Govt: రేవంత్ సర్కార్‌కు కాళేశ్వరం కమిషన్ షాక్.. కేసీఆర్ విచారణ తర్వాత కొత్త మలుపు
Kaleshwaram Commission shocks Revanth Govt: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ అయిన మేడిగడ్డ.. ప్రారంభించిన రెండేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఘటన జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. కమిషన్ ఏర్పాటు చేసింది.

Kaleshwaram Commission shocks Revanth Govt: కాళేశ్వరం.. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. నేషనల్ జియోగ్రఫీ ఛానెల్లో పెద్ద డాక్యుమెంటరీ ప్రసారం చేయించింది. ఇక లక్ష ఎకరాలకు కొత్తగా నీరందుతుందని వెల్లడించింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ అయిన మేడిగడ్డ.. ప్రారంభించిన రెండేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఘటన జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. కమిషన్ ఏర్పాటు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ పిల్లర్లు కుంగిపోగా, అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద బుంగలు పడ్డాయి. దీంతో కేంద్రంలోని డ్యాం సేఫ్టీ అథారిటీ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయొద్దని ఆదేశించింది. తాజాగా బ్యారేజీలు పనికిరావని నిర్ధారించింది. అయితే రూ.90 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీలు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్ అవినీతి, నాణ్యతలోపంపై విచారణకు కమిషన్ వేశారు. ఈ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది.
మినిట్స్ కోసం లేఖలు..
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ సమర్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మూడోసారి డిమాండ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినప్పటికీ స్పందన రాకపోవడంతో కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఎన్నిసార్లు లేఖలు రాయాలి?‘ అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టింది.
కేసీఆర్ విచారణ తర్వాత కొత్త మలుపు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై, ప్రాజెక్టు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ఉందని వివరణ ఇచ్చిన తర్వాత, కమిషన్ ఆ మినిట్స్‌ను పరిశీలించాలని నిర్ణయించింది. కేసీఆర్ స్టేట్మెంట్తో కమిషన్ దృష్టి మినిట్స్‌పై మరింత ఉధృతమైంది, కానీ ప్రభుత్వం వాటిని సమర్పించడంలో జాప్యం చేయడం సందేహాలకు తావిస్తోంది.
బూమరాంగ్ అయ్యే ప్రమాదం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేసీఆర్‌ను దోషిగా నిరూపించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, కేబినెట్ మినిట్స్ సమర్పించకపోవడం విచారణ ప్రక్రియను సంక్లిష్టం చేస్తోంది. ఈ జాప్యం కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాన్ని తిరగదోడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమిషన్ నివేదిక తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.
-
Rajagopal Reddy Counters CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి వార్నింగ్