War 2 Telugu Pre-Release Event: వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సితార ఎంటర్ టైన్ మెంట్స్ క్లారిటీ
War 2 Telugu Pre-Release Event వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో ప్లాన చేస్తున్నారని ఈవెంట్ కు ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హాజరవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

War 2 Telugu Pre-Release Event: వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సితార ఎంటర్ టైన్ మెంట్స్ క్లారిటీ ఇచ్చింది. స్పై జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ కియారా అద్వానా ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలు. వార్ 2 సినిమా ఆగస్టు 14న తెలుగు, హిందీ, తమిళీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
అయితే వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో ప్లాన చేస్తున్నారని ఈవెంట్ కు ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హాజరవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ పుకార్లనుు కొట్టిపారేసింది. వార్ 2 ఈవెంట్ గురించి వస్తున్న కథనాలు పుకార్లు మాత్రమే. ఇప్పటివరకు ఈవెంట్ స్థలం నిర్ణయం కాలేదు. త్వరలోనే ఈవెంట్ గురించి నిర్ణయం తీసుకున్నాక అధికారికంగా ప్రకటిస్తామని ఎక్స్ లో పేర్కొంది.