NTR : ‘వార్ 2’ మాత్రమే కాదు.. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా పండుగ అనే చెప్పొచ్చు. హృతిక్ రోషన్, కియారా అద్వానీలతో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఈ ఏడాది విడుదల కాబోయే భారీ చిత్రాల్లో ఒకటి. యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) స్పై యూనివర్స్‌లో వస్తున్న ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ సినిమా టీజర్ త్వరలోనే విడుదల కానుంది. అయితే, వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర కేవలం ఈ సినిమాకే పరిమితం కాదని, మేకర్స్ దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో కొనసాగనున్న ఎన్టీఆర్
‘వార్ 2’ 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘వార్’కు సీక్వెల్‌గా వస్తోంది. వార్ సినిమాలో హృతిక్ రోషన్ ఎదురుగా టైగర్ విలన్‌గా కనిపించాడు. ఇప్పుడు వార్ 2లో ఆ బాధ్యత ఎన్టీఆర్ భుజాలపై ఉంది. కానీ ఆయన ప్రయాణం వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో వార్ 2తోనే ముగిసిపోదు. ఈటైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆదిత్య చోప్రా ఎన్టీఆర్ పాత్రను సల్మాన్ ఖాన్ ‘టైగర్’, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పాత్రల తరహాలోనే ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. పఠాన్ తర్వాత పఠాన్ 2 కూడా రానుంది.
Read Also:AP Telangana Theaters Closed : ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ కీలక పాత్ర
వార్ 2లో ఎన్టీఆర్ పోషించే పాత్రను మేకర్స్ ఈ ఫ్రాంచైజీలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లోని అనేక ఇతర ప్రాజెక్ట్‌లలో కూడా ఈ పాత్ర కనిపించవచ్చు. అయితే, వార్ 2లో ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారో, అతని పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్ పుట్టినరోజున ‘వార్ 2’ టీజర్
వార్ 2 టీజర్‌ను మేకర్స్ మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. హృతిక్ కూడా మే 16న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ దీనికి సంబంధించిన హింట్ ఇచ్చాడు. ఆయన ఎక్స్ పోస్ట్‌లో..“జూనియర్ ఎన్టీఆర్ మీకు మే 20న ఏమి జరగబోతోందో తెలుసా? ఏమి జరగబోతోందో మీకు తెలియదు.రెడీగా ఉండండి’’అని రాసుకొచ్చారు.
Read Also:Bhairavam Trailer: వచ్చేసిన ‘భైరవం’ ట్రైలర్.. లాస్ట్‌లో ఈ షార్ట్ మాత్రం అదుర్స్
ఆగస్టు 14, 2025న ‘వార్ 2’ విడుదల
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రం ఎన్టీఆర్‌కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీని ద్వారానే ఆయన బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
-
War 2 Telugu Pre-Release Event: వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సితార ఎంటర్ టైన్ మెంట్స్ క్లారిటీ
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం