Bhairavam Trailer: వచ్చేసిన ‘భైరవం’ ట్రైలర్.. లాస్ట్‌లో ఈ షార్ట్ మాత్రం అదుర్స్

Bhairavam Trailer: విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలిసి నటిస్తున్న మూవీ ‘భైరవం’. ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ముగ్గురు కలిసి సినిమా చేయబోతున్నారని మూవీ టీం ప్రకటించిన తర్వాత అద్భుతమై రెస్మాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉంది. ఈ ట్రైలర్ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నుంచి ఒక శక్తివంతమైన శ్లోకంతో ప్రారంభమవుతుంది. దైవం ధర్మాన్ని నిలబెట్టడానికి ఏ రూపంలోనైనా భూమికి దిగివస్తాడని, ఆధ్యాత్మిక, తీవ్రమైన స్వరాన్ని ఏర్పరుస్తుందని అంటారు. ఇక దేవాదాయ మంత్రి దురాశ, అవినీతితో నడిచే వారాహి ఆలయం పవిత్ర భూములపై తన దృష్టిని కేంద్రీకరించడంతో కథ కాస్త వైలెన్స్‌గా మారుతుంది.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
ఆలయాన్ని కాపాడుకోవడానికి ముగ్గురు స్నేహితులు కలిసి అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా నిలుస్తారు. వారి నుంచి ఆలయాన్ని కాపాడుతారు. ఇదే సినిమా స్టోరీలా ఉంది. అయితే ట్రైలర్ విషయానికొస్తే అదిరిపోయిందని చెప్పవచ్చు. ట్రైలర్‌లో డైలాగ్‌లు ఒక్కో దగ్గర షాట్‌లు సూపర్‌గా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు పవర్ ఫుల్ పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. చివరి షాట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే పిచ్చేక్కించాడని చెప్పవచ్చు. ట్రైలర్ విషయానికి వస్తే అంతా బాగానే ఉంది. అయితే ఒరిజినల్ వెర్షన్ ‘గరుడన్’ కి మక్కీకి మక్కి లొకేషన్స్‌తో సేమ్ టూ సేమ్ అనిపిస్తుంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ కొట్టింది. హరి, శశికుమార్, ఉన్ని ముకుందన్ (మార్కో హీరో) నటించారు. అయితే తెలుగులో ‘భైరవం’ లో హరి క్యారక్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, శశికుమార్ క్యారక్టర్‌లో నారా రోహిత్, ఉన్ని ముకుందన్ క్యారక్టర్‌లో మంచు మనోజ్ నటించాడు.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
ఇందులో మంచు మనోజ్ నెగిటివ్ రోల్ చేయగా.. నారా రోహిత్ పవర్ ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ అని ట్రైలర్‌తో తెలుస్తోంది. సినిమాలో డైలాగ్‌లు కూడా బాగా రాసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేస్తారు. మొదట్లో సాధారణంగానే ఉన్న చివరిలో మాత్రం రక్తపాతంతో తడిపేస్తారు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడటం కోసం ఏదో ఒక రూపంలో దేవుడు వస్తాడని చెబుతాడు. అదే సమయంలో బెల్లం కొండ శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తాడు.