Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!

Manchu Manoj: పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మంచు విష్ణు ముఖ్య పాత్ర వహించారు. ఇందులో ముఖ్య నటులు నటించారు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విష్ణు మంచు ముఖ్య పాత్రలో నటించారు. ఇక మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ ఇలా ఎక్కువ మంది ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమాకి షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ చేశారు. ఈ సినిమా నేడు గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా బాగుందని, మంచు విష్ణు నటన అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా ఫస్టాప్ కంటే సెకండాఫ్ బాగుందని, ఫైనల్ 40 నిమిషాలు అయితే ఇంకా బాగుందని ట్వీ్ట్లు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మంచు మనోజ్ కన్నప్ప చిత్రాన్ని ఉద్దేశిస్తూ స్పెషల్‌గా ఓ ట్వీట్ చేశారు. అన్న విష్ణు పేరును ఎత్తకుండానే మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కన్నప్ప మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.
All the best to Team #Kannappa!
My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.
Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.
So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025
నా తరఫన కన్నప్ప మూవీ టీంకు శుభాకాంక్షలు. ఈ సినిమా కోసం మా నాన్న, టీమ్ మొత్తం ఎంతగానో ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డారు. ఎంతో ప్రేమగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. మై లిటిల్ చాంపియన్స్ అరి, వివి, అవ్రామ్‌లను కూడా ఇలా స్క్రీన్‌పై చూడటానికి ఆనందం ఉందని తెలిపారు. తనికెళ్ల భరణి స్టోరీ ఇప్పుడు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించడం హ్యాపీగా ఉంది. గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్ అందరూ కూడా మూవీకి సపోర్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మూవీకి సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలని మనోజ్ తెలిపారు. ఈ సినిమా హిట్ కావడానికి శివుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. అయితే తన అన్న పేరు ఎత్తకుండా ట్వీట్ చేశాడు. ఆఖరికి పిల్లల పేర్లు చెప్పారని కానీ విష్ణు పేరు అయితే ఎత్తలేదని అన్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి. మంచు విష్ణు, మనోజ్ ఇద్దరు మధ్య తీవ్రస్థాయిలో అయ్యాయి. ఈ క్రమంలో మనోజ్ పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
Read Also:Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!