Mohan Babu : న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న మంచు మోహన్ బాబు విష్ణు.. అసలు నిజం వెలుగులోకి

Mohan Babu : ఇటీవల సోషల్ మీడియాలో మంచు మోహన్ బాబు ఒక వీడియోతో తెగ వైరల్ అయ్యారు. ఆ వీడియోలో మోహన్ బాబు “మేము న్యూజిలాండ్‌లో ఈ స్థలాన్ని, ఆ కొండలనూ.. మొత్తం 7 వేల ఎకరాలను మంచు విష్ణు కోసం కొన్నాం. ఇదంతా మాదే” అని చెప్పడం వినిపిస్తుంది. పక్కన ముకేష్ రుషి, ప్రభుదేవా, మంచు విష్ణు కూడా ఉన్నారు. ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి, మంచు కుటుంబం గురించి సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ నడుస్తోంది.
“మంచు కుటుంబంలో ఇదేం జరుగుతోంది? పెద్ద కొడుకు విష్ణుకు అంత ఆస్తి ఇచ్చి, చిన్న కొడుకు మనోజ్‌ను రోడ్డున పడేస్తారా? ఇది తండ్రికి ఉండాల్సిన లక్షణమేనా?” అంటూ మోహన్ బాబుపై రకరకాల కామెంట్లు, ట్రోలింగ్లు స్టార్ట్ అయ్యాయి. మంచు మనోజ్ ఆస్తి తగాదాల వల్లే గొడవ పడుతున్నాడా అనే అనుమానాలూ వచ్చాయి. అయితే, ఈ వీడియోలో ఎంత నిజం ఉంది? అసలు ఆ వీడియో వెనుక కథ ఏంటి? అనే విషయంలో ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది.
Read Also : Actor Srikanth : మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ హీరో, నటులు.
Mohanbabu Mass 😂😂😂#JustforGags pic.twitter.com/Nbb2y053R6
— V@ndeM@taR@m (@patriotatwork99) June 22, 2025
మోహన్ బాబు ఆ వీడియోలో చెప్పింది నిజం కాదని, అదంతా కేవలం సరదా కోసం చేసిన కామెడీ అని తేలిపోయింది. నిజానికి, న్యూజిలాండ్‌లో అంత పెద్ద మొత్తంలో భూమిని విదేశీయులు కొనడానికి అవకాశం లేదు. న్యూజిలాండ్ పౌరులు కానివారికి అక్కడ భూమిని సొంతం చేసుకునే అనుమతి లేదు. మరి మోహన్ బాబు ఎందుకు అలా చెప్పారు? అంటే ఆయన కడుపులో ఉన్న ‘నీళ్ళు’ అలా చెప్పించాయి. ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆయన తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే.. మోహన్ బాబు, విష్ణు మంచుతో నేను పోస్ట్ చేసిన ఆ వీడియో కేవలం సరదా కోసం చేసింది. మేమంతా అప్పుడు నవ్వుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాం. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం, అక్కడి కొండలు కూడా మావే అని సరదాగా జోక్ చేశాం. మంచు విష్ణు కూడా అందుకు తగ్గట్టుగానే యాక్ట్ చేశాడు. మోహన్ బాబు సార్ అయితే ఫుల్ కామెడీ మూడ్‌లో ఉన్నారు. నేను ఎప్పటిలాగే ఆయన్ని ఆటపట్టించాను.
“Guys, come on! 😄”
That video I posted with Mr. Mohan Babu garu and Vishnu Manchu was pure fun — just a bunch of us having a good laugh like we always do.
We joked about buying 7000 acres in New Zealand, even owning the mountains! Vishnu played along, Mohan Babu garu was in…— Brahmaji (@actorbrahmaji) June 22, 2025
Read Also :premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ
మేం సరదాగా చేస్తే, సడెన్‌గా జనం ఇది నిజమని నమ్మడం స్టార్ట్ చేశారు?! అలా నమ్మే వాళ్ళందరికీ.. హే భాయ్… న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనడం అంత ఈజీ అయితే, నేను ప్రతి వారం అక్కడ షూటింగ్ చేస్తూ ఉండేవాడిని..మేమంతా సరదా కోసం చేశాం, అది తప్పు. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ ఫన్నీ వీడియో మరింత వివాదాస్పదం కాకముందే.. అందరికీ ఒక విషయం స్పష్టం చేయాలి. న్యూజిలాండ్‌లో ఎవరూ ఎలాంటి భూమిని కొనుగోలు చేయలేదు. న్యూజిలాండ్ పౌరులు కానివారికి అక్కడ భూమిని సొంతం చేసుకునే అనుమతి లేదు లేదా అర్హత లేదు. దయచేసి ఈ ఫన్నీ వీడియోను సీరియస్‌గా తీసుకోవద్దు. అందరూ కొంచెం నవ్వుకోండి. కామెడీ కోసం చేసిన దాన్ని ఇంకోలా మార్చొద్దు. ‘కన్నప్ప’ రిలీజ్ అవుతోంది. అందరూ సినిమా చూడటానికి రెడీ అవ్వండి.” బ్రహ్మాజీ ఇచ్చిన ఈ క్లారిటీతో, న్యూజిలాండ్ ఎకరాల గురించిన పుకార్లకు ఫుల్స్టాప్ పడినట్లే. మంచు కుటుంబంపై అనవసరంగా వస్తున్న విమర్శలు, ట్రోలింగ్లు ఇక ఆగుతాయని చెప్పుకోవచ్చు.
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
-
Mohan Babu : మంచు విష్ణు కోసం న్యూజిలాండ్ లో 7000ఎకరాలు కొన్న మోహన్ బాబు.. వీడియో వైరల్
-
Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!
-
Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!
-
Viral Video: బుర్జ్ ఖలీఫాపై గర్బా ప్రదర్శన.. నెటిజన్లు ట్రోలింగ్.. కారణమిదే?