Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Kollywood Stars Actors Srikanth Krishna Under Police Scanner Shocking Details

Actor Srikanth : మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ హీరో, నటులు.

Actor Srikanth : మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ హీరో, నటులు.
  • Edited By: rocky,
  • Updated on June 23, 2025 / 04:48 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Actor Srikanth : సినిమా ఇండస్ట్రీని ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల కేసులు కుదిపేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి షాకింగ్ వార్త ఒకటి కోలీవుడ్ లో కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ మాదర ద్రవ్యాల కేసులో ఉన్నారని చెన్నై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నైలోని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ పోలీసులు శ్రీకాంత్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నుంగంబాక్కం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ బార్‌లో జరిగిన గొడవలో అరెస్టైన, మాజీ ఏఐఏడీఎంకే ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ పోలీసులకు కొన్ని షాకింగ్ నిజాలు చెప్పినట్లు తెలుస్తోంది. నటుడు శ్రీకాంత్‌కు తాను మాదక ద్రవ్యాలు అమ్మానని ప్రశాంత్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు శ్రీకాంత్‌ను విచారణకు పిలిపించారు.

Read Also:premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ

శ్రీకాంత్‌కు వైద్య పరీక్షలు కూడా నిర్వహించడంతో పాటు, ఆయన మాదక ద్రవ్యాలను వాడారా లేదా అని నిర్ధారించడానికి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ప్రశాంత్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ‘తీన్గారై’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్‌కు మాదకద్రవ్యాలు అవసరం అయిందట. అప్పుడు తను రూ. 12,000కు వాటిని అమ్మినట్లు ప్రశాంత్ చెప్పాడు. అంతేకాదు, శ్రీకాంత్, నటుడు కృష్ణ ఇద్దరూ చెన్నైలోని క్లబ్‌లు, పార్టీలలో వాటిని వాడినట్లు కూడా ప్రశాంత్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశాంత్ స్టేట్‌మెంట్ తర్వాత, నటుడు కృష్ణ పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో శ్రీకాంత్, కృష్ణ ప్రమేయంపై ప్రశాంత్ వాంగ్మూలం కీలక సాక్ష్యంగా మారింది. టెస్ట్ రిపోర్టులు, దర్యాప్తు సమయంలో తేలిన విషయాల తర్వాత తదుపరి చర్యలుండనున్నట్లు తెలుస్తోంది. ఈలోగా, శ్రీకాంత్, కృష్ణ మాదకద్రవ్యాల వాడకం వార్తలు కోలీవుడ్ అభిమానులను షాక్‌కు గురిచేశాయి. దర్యాప్తులో వీరి పేర్లు బయటపడడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Read Also:Barkha Madan : గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసినిగా మారిన టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?

Tag

  • Actor Krishna
  • Actor Srikanth
  • Chennai Police
  • Kollywood
  • Prashanth Arrest
Related News
  • Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్

  • Rashmika : వామ్మో.. బాలీవుడ్‎లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు

  • Nayanthara : ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ కు అంతకోపమెందుకు ?

  • Aamir Khan : కేవలం 8 నిమిషాలకే రూ. 30 కోట్లు..రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ కామియోరోల్

  • Kollywood: తమిళంలో హిట్… తెలుగులో ఫ్లాప్.. అసలు కోలివుడ్‌కి ఏమైంది?

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us