Barkha Madan : గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసినిగా మారిన టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?

Barkha Madan : సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. పేరు, డబ్బు, స్టార్‌డమ్… అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలామంది కలలు కనే ఈ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఓ నటి.. ఉన్నత స్థాయిలో ఉండగానే అన్నింటినీ వదిలేసి, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఆమెనే బాలీవుడ్‌కు చెందిన బర్ఖా మదన్. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి నటించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్ఖా మదన్ ఉన్నట్లుంది బౌద్ధ సన్యాసినిగా మారిన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బర్ఖా మదన్ సినీ రంగంలోకి రాకముందు ఒక మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 1994లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలలో సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో కలిసి ఆమె కూడా పోటీ పడింది. మోడలింగ్ తర్వాత నటనపై దృష్టి సారించిన బర్ఖా, 1996లో అక్షయ్ కుమార్, దిగ్గజ నటి రేఖతో కలిసి ‘ఖిలాడియోం కా ఖిలాడి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
Read Also:Rocking Rakesh : ఘనంగా రాకింగ్ రాకేష్ కూతురి అన్నప్రాసన వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు
అయితే, ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ 2003లో వచ్చింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘భూత్’ సినిమా ఆమెకు రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత బర్ఖా మదన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అనతి కాలంలోనే వరుసగా సినిమాలు చేస్తూ బిజీ స్టార్‌గా మారింది. తన కెరీర్‌లో దాదాపు 20 సినిమాల్లో నటించడంతో పాటు, అనేక టీవీ షోలలో కూడా కనిపించింది.
సినిమాల్లో మంచి ఫామ్‌లో ఉండి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ 2012లో బర్ఖా మదన్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గ్లామర్, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ వదులుకుని బౌద్ధ సన్యాసినిగా మారాలని నిశ్చయించుకుంది. బౌద్ధ మతం తత్వాలు, జీవితాన్ని చూసే విధానం, ప్రశాంతత ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. అందుకే, తన సక్సెస్ ఫుల్ సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
Read Also:Credit Score : పదే పదే చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా.. నిజమిదే ?
బర్ఖా మదన్ సెరా జె ఆశ్రమం నుంచి సన్యాస దీక్ష తీసుకుంది. సన్యాసినిగా మారిన తర్వాత ఆమె తన పేరును వెం. గాల్టెన్ సామటెన్ గా మార్చుకుంది. ప్రస్తుతం ఆమె పర్వత ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ మఠాల్లో నిరాడంబరమైన సన్యాసిని జీవితాన్ని గడుపుతోంది. కోట్లాది రూపాయల సంపాదనను, లైఫ్‌స్టైల్‌ను వదులుకొని, పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతంగా జీవిస్తోంది.
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం
-
Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్