Credit Score : పదే పదే చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా.. నిజమిదే ?

Credit Score : మనం ఎప్పుడైనా లోన్ తీసుకోవాలని అనుకుంటే ముందుగా క్రెడిట్ స్కోర్ గురించి ఆలోచిస్తాం. చాలామంది లోన్ తీసుకునే ముందు తమ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకుంటారు. మరికొందరు అయితే అవసరం లేకపోయినా, మాటిమాటికీ తమ స్కోర్ ఎంత ఉందో చూసుకుంటూ ఉంటారు. అయితే, ఇలా ఎక్కువసార్లు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తే ఆ స్కోర్ తగ్గిపోతుందేమోనని చాలామందిలో ఒక అనుమానం ఉంటుంది. అసలు ఇది నిజమా, కాదా? వివరంగా తెలుసుకుందాం.
సాఫ్ట్ ఎంక్వైరీ, హార్డ్ ఎంక్వైరీ అంటే ఏంటి?
ముందుగా మనం సాఫ్ట్ ఎంక్వైరీ, హార్డ్ ఎంక్వైరీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి.
సాఫ్ట్ ఎంక్వైరీ: మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను మీరే స్వయంగా తనిఖీ చేసుకుంటే, దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే, మీరు లోన్ కోసం వెళ్ళినప్పుడు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ముందుగా మీకు లోన్ ఇవ్వచ్చా లేదా అని చెక్ చేయడానికి మీ క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. దీన్ని కూడా సాఫ్ట్ ఎంక్వైరీ కిందే పరిగణిస్తారు. మీరు పనిచేస్తున్న సంస్థ మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసినా, అది కూడా సాఫ్ట్ ఎంక్వైరీ కిందికే వస్తుంది. సాఫ్ట్ ఎంక్వైరీ వల్ల మీ క్రెడిట్ స్కోర్ అస్సలు తగ్గదు. మీరు ఎన్నిసార్లైనా మీ స్కోర్‌ను చూసుకోవచ్చు.
Read Also:UPI : యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త
హార్డ్ ఎంక్వైరీ: మీరు ఒక బ్యాంకులో లోన్ కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ లోన్ అప్లికేషన్‌ను పరిశీలించడానికి బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పూర్తిగా చెక్ చేస్తాయి. దీన్ని ‘హార్డ్ ఎంక్వైరీ’ అంటారు. మీ అభ్యర్థన మేరకు లోన్ ఇవ్వడానికి ముందు చేసే ఈ తనిఖీ మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.
హార్డ్ ఎంక్వైరీ వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
హార్డ్ ఎంక్వైరీ వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎంత తగ్గుతుంది అనేది మీ ప్రస్తుత క్రెడిట్ స్కోర్, అలాగే మీరు ఎన్ని హార్డ్ ఎంక్వైరీలు చేయించుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. లోన్ కోసం ఎక్కువ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు దరఖాస్తు చేసుకుంటే అది మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని క్రెడిట్ బ్యూరోలు భావిస్తాయి. దీనివల్ల ఒక్కో హార్డ్ ఎంక్వైరీపై 3-10 పాయింట్ల వరకు మీ క్రెడిట్ స్కోర్ తగ్గవచ్చు. ఒకవేళ మీరు తక్కువ సమయంలో చాలా లోన్ అప్లికేషన్లు పెట్టి, ఎక్కువ హార్డ్ ఎంక్వైరీలు చేయించుకుంటే మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గవచ్చు.
కాబట్టి మీ క్రెడిట్ స్కోర్‌ను మీరే పదేపదే చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, లోన్ కోసం ఎక్కువసార్లు దరఖాస్తు చేసి, హార్డ్ ఎంక్వైరీలను పెంచుకుంటే మాత్రం అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
Read Also:Girls Hair: అబ్బాయిలకు అమ్మాయిల జుట్టు పొడవుగా లేదా పొట్టిగా ఉంటే ఇష్టమా!
-
Cibil Score: లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. కారణమేంటో తెలుసా?
-
First Time Home Loan: ఫస్ట్ టైం హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. వీటిని మరిచిపోవద్దు
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే.. మీకు లోన్ వస్తుందో తెలుసా?