Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి

Credit Card: ప్రస్తుతం అందరి దగ్గర కూడా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. సడెన్‌గా డబ్బులు అవసరం అయినప్పుడు ఈ క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే డబ్బు అవసరం ఉన్నప్పుడు ఎవరైనే అడిగితే ఇవ్వకపోవచ్చు. అలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డు నుంచి తీసుకుని ఆ తర్వాత కట్టేయవచ్చు. దీనివల్ల ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు. అయితే వారి జీతం బట్టి ఒకోక్కరికి క్రెడిట్ కార్డు లిమిట్ ఉంటుంది. కొందరికి తక్కువగా ఉంటే, మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండటం వల్ల అవసరాలకు ఆ లిమిట్ సరిపోదు. దీంతో క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవాలంటే ఏం చేయాలి? దీని కోసం పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవడం వల్ల కొన్నిసార్లు క్రెడిట్ స్కోర్ మీద ప్రభావితం అవుతుంది. అయితే అత్యవసర పరిస్థితులు, ప్రయాణం, బంగారం, ఆస్తులు కొనుగోలు సమయాల్లో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ కార్డు ముందు నుంచి సరిగ్గా వాడటం వల్ల మీ సిబిల్ స్కోర్ బాగుంటుంది. దీనివల్ల మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్ కార్డ్ కంపెనీలు తరచుగా ప్రీమియం రివార్డ్ ప్రోగ్రామ్‌లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలను ఇస్తాయి. వీటి ద్వారా కూడా క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే మీరు మీ లిమిట్‌ను పెంచుకోవడానికి ఈ రూల్స్ అన్ని కూడా తప్పకుండా పాటించాలి. కనీసం ఆరు నుంచి ఏడాది పాటు చెల్లింపు హిస్టరీని పాటించాలి. సరిగ్గా పాటిస్తేనే మీరు క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏడాది నుంచి సరిగ్గా చూస్తేనే బ్యాంకుకు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఫోన్ కాల్ ద్వారా బ్యాంకుకు రిక్వెస్ట్ పంపి అప్లై చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్, చెల్లింపు అన్నింటి ఆధారంగా బ్యాంకు వారు నిర్ణయాలు తీసుకుంటారు.
క్రెడిట్ కార్డు మంచిదని చాలా మంది అనుకుంటారు. కానీ దీని ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు వల్ల ఎక్కువగా అప్పు చేయాల్సి వస్తుంది. పొరపాటున క్రెడిట్ ఉంటే.. అవసరం లేని వస్తువులు కూడా కొనాల్సి వస్తుంది. దీనివల్ల మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి అప్పుల పాలు అవుతారు. ఆ డబ్బులను సరైన సమయానికి కట్టలేకపోతే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. భవిష్యత్తులో లోన్ కావాలంటే బ్యాంకులు కూడా ఇవ్వవు. లోన్ తీసుకున్నా కూడా వెంటనే కట్టేయడం మంచిది. లేకపోతే మాత్రం క్రెడిట్ కార్డు వాడకపోవడం బెటర్ అని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Loans: తాత్కాలిక లోన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇక మీకు చావే
-
Tholi Ekadasi: తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Banks: ఈ బ్యాంకులకు ఇకపై మినిమం బ్యాలెన్స్ ఉండక్కర్లేదు.. ఆ బ్యాంకులు ఏవంటే?
-
With out pay slips personal Loan: పే స్లిప్స్ లేకపోతే పర్సనల్ లోన్ రాదా?
-
Breakup: బ్రేకప్‌తో సతమతమవుతున్నారా.. బయటపడాలంటే ఇలా చేయండి
-
Lazy: బద్ధకం బాగా ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే రిలీఫ్