Breakup: బ్రేకప్‌తో సతమతమవుతున్నారా.. బయటపడాలంటే ఇలా చేయండి

Breakup: ఇప్పుడున్న రోజుల్లో లవ్‌లో ఉన్నవారి కంటే బ్రేకప్ అయిన వారు ఎక్కువగా ఉన్నారు. ప్రేమలో ఫెయిల్ అయితే కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు కూర్చోని కొన్ని రోజుల పాటు బాధపడుతుంటారు. ఇలా ప్రేమలో విఫలమైతే బాధపడుతూ ఉండటం వల్ల జీవితంలో మిమ్మల్ని మీరే కోల్పోతారు. దీనికి తోడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఫుడ్ తీసుకోకుండా ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల శారీరకంగా కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మనలో చాలా మందికి బ్రేకప్ నుంచి ఎలా బయటపడాలనే విషయం సరిగ్గా తెలియదు. దీనివల్ల ప్రేమించిన వారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. ఎవరితో కలవకుండా ఒంటరిగానే ఉంటారు. పాత జ్ఞాపకాలు అన్నింటి గురించి ఆలోచిస్తుంటారు. ఎవరితో కూడా సంతోషంగా మాట్లాడకుండా బాధపడుతుంటారు. అయితే బ్రేకప్ బాధ నుంచి విముక్తి పొందాలంటే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
బ్రేకప్ తర్వాత మీ ప్రేమను మరిచిపోవాలంటే మళ్లీ వారి వైపు చూడకూడదు. వారిని కలవడానికి, మాట్లాడటానికి ప్రయత్నించకూడదు. మీరు తనతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు వారు స్పందించికపోతే మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మళ్లీ మీ ప్రేమను తలచుకుని బాధపడతారు. మళ్లీ మళ్లీ వాటిని గుర్తు చేసుకుని బాధపడటం వల్ల మీరు బ్రేకప్ నుంచి బయటపడలేరు. వారితో మాట్లాడటానికి సమయం కేటాయించడం కంటే మీ కెరీర్‌పై దృష్టి పెట్టడం బెటర్. ఎందుకంటే మీరు మంచి పొజిషన్‌లో ఉంటే మళ్లీ మీ పార్ట్‌నర్ మీ సక్సెస్ చూసి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఎందుకు మిస్ చేసుకున్నానని ఫీల్ కావాలి. అలా మీరు జీవితంలో ఎదగాలి. ప్రేమను మరిచిపోవాలంటే ఇతరులతో కలిసి తిరగడం వంటివి చేయాలి. ఎక్కువ సమయం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూర్చోని మాట్లాడటం, వారితో బయటకు వెళ్లడం వంటివి చేయాలి. వీటివల్ల కాస్త బ్రేకప్ నుంచి బయటపడతారు.
బ్రేకప్ నుంచి బయటపడాలంటే మాత్రం తప్పకుండా చేయాల్సింది బిజీగా ఉండటం. ఎంత ఎక్కువగా బిజీగా ఉంటే మీరు అంత బయటపడతారు. అంటే మీకు ప్రేమించిన వ్యక్తి గురించి కూడా ఆలోచించే సమయం ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం వల్ల ఈజీగా బ్రేకప్ నుంచి తప్పించుకుంటారు. అలాగే అప్పుడప్పుడు కొత్త ప్లేస్‌లకు వెళ్లండి. కొత్త ప్లేస్ వల్ల మీ మైండ్ మారుతుంది. దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూడటం వల్ల మీరు ఈజీగా బ్రేకప్ నుంచి బయటపడతారు. పూర్తిగా ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోయినా కూడా తన ఆలోచనల నుంచి మాత్రం బయటపడతారు. బిజీగా ఉంటూ, అప్పుడప్పుడు బయటకు వెళ్లడం, కొత్త ప్లేస్‌లు చూడటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు ఈజీగా బ్రేకప్ నుంచి విముక్తి పొందుతారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also read : Ramayana movie first glimpse review: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఏదో మిస్ అవుతుంది
-
Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి
-
Tholi Ekadasi: తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Lazy: బద్ధకం బాగా ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే రిలీఫ్
-
Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడం ఎలా?
-
Life Lessons: నీ చుట్టూ ఎవరు ఉంటారో.. వారే బట్టే నీ భవిష్యత్తు?
-
Washing Silk Sarees : పట్టు చీరలు, సూట్‌లు ఎప్పటికీ కొత్తలా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి