Washing Silk Sarees : పట్టు చీరలు, సూట్‌లు ఎప్పటికీ కొత్తలా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి

Washing Silk Sarees : పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయినప్పుడు పట్టు చీరలు కట్టుకుని అందంగా కనిపించాలని అనుకోని మహిళలు ఉండరు. అందుకే పట్టు చీరలు, సూట్‌లు వార్డ్‌రోబ్‌లో ప్రత్యేకంగా ఉంచుతారు. వాటి మెరుపు, మృదుత్వం ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే వాటిని ఉతకడమంటే చాలా మందికి భయమేస్తూ ఉంటుంది. వాటి మెరుపు పోతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ పట్టు వస్త్రాలు ఎప్పటికీ కొత్తలా మెరుస్తూ ఉంటాయి.
పట్టు వస్త్రాలు చాలా ఖరీదైనవి కాబట్టి వాటి మెరుపు తగ్గినా, రంగు వెలిసినా బాధగా ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పట్టు వస్త్రాలను ఇంట్లోనే సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. వాటి మెరుపు కూడా కొత్త వాటిలాగే ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Read Also:Anaganaga: తండ్రి, కొడుకు మధ్య ఉన్న ఎమోషన్.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా!]
చల్లటి నీటితో ఉతకాలి
పట్టు వస్త్రాలను ఎప్పుడూ వేడి నీటితో శుభ్రం చేయకూడదు. దీనివల్ల పట్టు పోగులు దెబ్బతింటాయి. దుస్తులు ముడుచుకుపోతాయి. మెరుపు కూడా తగ్గుతుంది. కాబట్టి పట్టును శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి.
లిక్విడ్ సోప్ ఉపయోగించండి
పట్టు వస్త్రాలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి సాధారణ డిటర్జెంట్ పౌడర్, సబ్బు వాటిపై హార్ష్‌గా ఉంటాయి. దీని కోసం మీరు లిక్విడ్ సోప్‌ను ఉపయోగించాలి. మార్కెట్‌లో పట్టు, షిఫాన్ వంటి తేలికపాటి దుస్తులను శుభ్రం చేయడానికి అనేక లిక్విడ్ సోప్‌లు సులభంగా లభిస్తాయి.
Read Also:AC Warranty Types : AC కొంటున్నారా? ఒక్కటి కాదు, ఈ 3 వారంటీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి !
దుస్తులను రుద్దకుండా ఉండాలి
పట్టు వస్త్రాలను ఎప్పుడూ బ్రష్‌తో రుద్దకూడదు. వాషింగ్ మెషీన్‌లో కూడా వేయకూడదు. అలా చేస్తే మొదటిసారికే అవి పాడైపోయే ప్రమాదం ఉంది. దుస్తులను నీటిలో కనీసం 10 నిమిషాలు నాననివ్వండి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఏదైనా మరక ఉంటే, ముందుగానే అక్కడ దారంతో గుర్తు పెట్టుకోండి. కొద్దిగా సోప్ వేసి తేలికగా చేత్తో శుభ్రం చేయండి.
దుస్తుల్లో సోప్ ఉండకూడదు
పట్టు వస్త్రాలలో నురుగు పూర్తిగా పోయే వరకు నీటిలో కడగాలి. దుస్తుల్లో సోప్ ఉండిపోతే మెరుపు తగ్గే అవకాశం ఉంది. నురుగు పూర్తిగా పోయిన తర్వాత దుస్తులను ఆరబెట్టడానికి వేయాలి. కానీ వాటిని పిండకూడదు. అలా చేస్తే ముడతలు పడతాయి.
ఈ విధంగా ఆరబెట్టాలి
పట్టు వస్త్రాలను నేరుగా సూర్యరశ్మి తగలని ప్రదేశంలో, శుభ్రమైన ఉపరితలంపై పరచి ఆరబెట్టండి. పట్టు వస్త్రాలను తేలికపాటి వెచ్చని వాతావరణంలో , బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఆరబెట్టాలి. బలమైన సూర్యకాంతి పట్టు సున్నితమైన పోగులను దెబ్బతీస్తుంది.
-
Phone Battery Drain :మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి
-
Skin Care: ఉదయం లేచిన వెంటనే ముఖానికి వీటిని అప్లై చేస్తే.. మెరిసిపోవడం ఖాయం
-
Hair: జుట్టు పెరగాలంటే ఇది ఒక్కటి రాస్తే చాలు
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Tips:పాత బంగారు నగలు కొత్తగా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి
-
Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే.. మీకు లోన్ వస్తుందో తెలుసా?