AC Warranty Types : AC కొంటున్నారా? ఒక్కటి కాదు, ఈ 3 వారంటీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి !

AC Warranty Types : కొత్త ఏసీని కొనేటప్పుడు చాలామంది ఎక్కడ మంచి డీల్ దొరుకుతుందా అని చూస్తారు. బెస్ట్ డీల్ వెతకడం తప్పేమీ కాదు. కానీ డీల్ కంటే ముఖ్యంగా ACతో కంపెనీ ఎన్ని సంవత్సరాల వారంటీ ఇస్తుందో కూడా చూసుకోవాలి. ACతో ఒకటి, రెండు లేదా మూడు.. ఎన్ని రకాల వారంటీలు ఇస్తారో తెలుసా. చాలా మందికి దీని గురించిన సమాచారం తెలియదు.
AC వారంటీ ఎన్ని రకాలు?
ఎయిర్ కండీషనర్‌తో మీకు ఒకటి కాదు, ఏకంగా మూడు రకాల వారంటీల బెనిఫిట్స్ లభిస్తుంటాయి. చాలా మంది ఒకే రకమైన వారంటీ మాత్రమే లభిస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
మొదటి వారంటీ: ఎయిర్ కండీషనర్‌తో కంపెనీ కేవలం 1 సంవత్సరం ఉత్పత్తి వారంటీనే కాకుండా చాలా రకాల వారంటీలను అందిస్తుంది. వాటి గురించి చాలా మందికి సరైన సమాచారం లేదు. ఒక సంవత్సరం ఉత్పత్తి వారంటీలో మీ ఎయిర్ కండీషనర్ ప్రతి భాగం కవర్ అవుతుంది.
Read Also:Google Maps : ఇక లొకేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు.. గూగుల్ ఫోటో చూసి చెప్పేస్తుంది!
రెండవ వారంటీ: ఉత్పత్తి వారంటీతో పాటు, AC తయారు చేసే కంపెనీలు వినియోగదారులకు కంప్రెసర్‌పై కూడా వారంటీని అందిస్తాయి. కొన్ని కంపెనీలు ఐదు సంవత్సరాల వరకు, మరికొన్ని కంపెనీలు 10 సంవత్సరాల వరకు వారంటీని ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌లో AC కొనేటప్పుడు మీరు కొంటున్న ACతో మీకు ఎన్ని సంవత్సరాల కంప్రెసర్ వారంటీ లభిస్తుందో తప్పకుండా తనిఖీ చేయండి.
అదే సమయంలో, మీరు ఆఫ్‌లైన్‌లో ఏదైనా స్టోర్ నుంచి ఏసీ కొంటుంటే.. ఏసీ అమ్మే వ్యక్తి నుంచి ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. మీ AC కంప్రెసర్‌పై ఎన్ని సంవత్సరాల వారంటీ ఉందో తెలియకపోతే, 1 సంవత్సరం మాన్యుఫాక్ఛరింగ్ వారంటీ ముగిసిన తర్వాత AC కంప్రెసర్‌లో సమస్య వస్తే వారంటీ ప్రయోజనాన్ని పొందే ఛాన్స్ ఉన్నప్పటికీ మీ సొంత డబ్బులతో రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది.
Read Also:Viral Video: ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్‌క్రీమ్ తినరు!
మూడవ వారంటీ: మాన్యుఫాక్చరింగ్, కంప్రెసర్ వారంటీతో పాటు, AC తయారు చేసే కంపెనీలు PCB వారంటీని కూడా అందిస్తాయి. సాధారణంగా కంపెనీలు PCBపై 5 సంవత్సరాల వరకు వారంటీ ప్రయోజనాన్ని అందిస్తాయి. కాబట్టి, మీ AC ఒక సంవత్సరం మాన్యుఫాక్చరింగ్ వారంటీ ముగిసిన తర్వాత మీ ACలో అమర్చిన PCB యూనిట్‌లో సమస్య వస్తే, అది వారంటీలో ఉన్నందున బెనిఫిట్ కలుగుతుంది.