Viral Video: ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్‌క్రీమ్ తినరు!

Viral Video: ప్రస్తుతం ఏ వస్తువు కూడా శుభ్రం లేకుండా పోతుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బేకరీలు, ఐస్‌క్రీములు ఇలా తయారు చేసే వాటిలో పురుగులు, బొద్దింక ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి. నిజానికి బయట ఏవైనా వస్తువులు తినాలన్నా కూడా భయం వేస్తోంది. ఏ ఫుడ్ తింటే ఎందులో ఏ జీవి కనిపిస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు. ప్యాకింగ్, ప్యాకింగ్ చేయని వాటిలో కూడా పురుగులు కనిపిస్తున్నాయి. కొందరు అయితే భయట తినడమే మానేసారు. ఎందులో ఏం వస్తుందని భయపడి తినడం మానేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
ఈ మధ్య కాలంలో ఫుడ్స్ మధ్యలో ఏదో ఒక పురుగు వంటివి కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. గుజరాత్ అహ్మాదాబాద్‌లో ఓ మహిళ ఐస్‌క్రీమ్ తింటుండగా బల్లి తోక కనిపించింది. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. ఆ ఐస్ క్రీమ్ తిన్న కొంత సమయానికే తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ఆమెకు అయ్యాయి. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
పిల్లలు ఐస్ క్రీమ్ అడగడంతో ఆ మహిళ మణినగర్‌లోని మహాలక్ష్మి కార్నర్ అనే షాప్‌కు వెళ్లి కొన్నారు. అయితే ‘హవ్మోర్’ అనే బ్రాండ్‌కు చెందిన నాలుగు ఐస్ క్రీములను ఆమె కొన్నారు. పిల్లలక కోన్ ఐస్ ఇష్టం అయితే వాటిని కొనుగోలు చేశారు. ఐస్‌క్రీమ్ తింటుండగా బల్లి తోక కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు ఈ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
ఐస్ క్రీం అమ్మిన షాపును సీజ్ చేశారు. ఎలాంటి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద లైసెన్స్ లేదని గుర్తించారు. అలాగే ఐస్‌క్రీమ్‌లు తయారు చేసిన కంపెనీకి నోటీసులు జారీ చేశారు. కంపెనీపై రూ.50వేల ఫైన్ వేశారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల ఓ రెస్టారెంట్లో బిర్యానీలో బ్లేడు కనిపించింది. ఇలా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయినా కూడా ఎవరూ శుభ్రత పాటించడం లేదు.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు
-
Rishabh Pant: ఫ్రస్టేషన్లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Mohan Babu : న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న మంచు మోహన్ బాబు విష్ణు.. అసలు నిజం వెలుగులోకి
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది