Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
స్వయం కృషి మీద పైకి వచ్చి మెగాస్టార్‌గా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. 50 ఏళ్ల నుంచి ఎన్నో సినిమాలు చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు మెగాస్టార్ ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి ఎన్నో సినిమాలు నటించారు. అన్ని కూడా హిట్ అయ్యాయి.

Young Directors: స్వయం కృషి మీద పైకి వచ్చి మెగాస్టార్‌గా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. 50 ఏళ్ల నుంచి ఎన్నో సినిమాలు చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు మెగాస్టార్ ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి ఎన్నో సినిమాలు నటించారు. అన్ని కూడా హిట్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చేసిన సినిమాలు ఒకటి అయితే.. ఇకపై చేసే సినిమాలు ఒకటి. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా చిరంజీవి హిట్‌లు కొట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకే అవకాశం ఇస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ డైరెక్టర్లు ఉన్నాయి. అయితే వీరిలో కొందరు అయితే మంచి హిట్‌లు కొట్టి వారి కంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. వారిలో అనిల్ రావిపూడి (Anil Ravipudi), శ్రీకాంత్ ఓదెల (Stikanth Odela) మొదటి స్థానంలో అయితే ఉన్నారు. అనిల్ రావిపూడి వరుస హిట్‌లు కొట్టి ఫ్లాప్ లు లేని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మంచి హిట్ కొట్టాడు. దీంతో మెగాస్టార్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలకు కూడా అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడితో పాటు శ్రీకాంత్ ఓదెలతో కూడా చిరంజీవి సినిమా చేయబోతున్నారు.
Read Also: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
చిరంజీవి ప్రస్తుతం ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. తన కెరీర్‌లో ఎన్నో కమర్షియల్ సినిమాలు చిరంజీవి చేశారు. ఇప్పుడు కూడా అవే చేయాలని భావిస్తున్నారు. అయితే చిరంజీవి హరీష్ శంకర్, మారుతి, వెంకీ కుడుముల లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం చాలా సెలెక్టెడ్‌గా దర్శకులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో సినిమాలు చేస్తున్నారు. అయితే త్వరలో ఇంకా కొందరు యంగ్ డైరెక్టర్లకి చిరంజీవి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి సినిమాలు చేసి హిట్ కొట్టాలని చిరంజీవి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలోచించి యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు. మరి చిరంజీవి అనిల్ రావిపూడి, ఓదెల శ్రీకాంత్‌తో పాటు ఇంకా ఎవరికి త్వరలో అవకాశాలు ఇస్తారో చూడాలి.
Read Also: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎన్ని నెలలు అవుతున్న కూడా ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయంపై మేకర్స్ స్పందిస్తేనే తెలుస్తుంది.
-
Mega 157: సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం అంటూ.. అనిల్-చిరంజీవి మూవీలో స్టార్ హీరయిన్
-
Mega 157: అనిల్ రావిపూడి చిరంజీవి మూవీ నుంచి వీడియో రిలీజ్ వైరల్
-
Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…
-
Hero Nani: ది ప్యారడైజ్.. ఈ పాత్రకు నాని ఒకే చెప్పడం వెనుక ఇంత కారణం ఉందా?
-
The Paradise glimpse: నాని ఊర మాస్ లుక్స్.. ఇదెక్కడి గ్లింప్స్ మావ.. కళ్లు చేదిరే స్టోరీ