Hero Nani: ది ప్యారడైజ్.. ఈ పాత్రకు నాని ఒకే చెప్పడం వెనుక ఇంత కారణం ఉందా?

Hero Nani:
నేచురల్ స్టార్ హీరో నాని ది ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ను మూవీ టీం ఇటీవల విడుదల చేసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఈ టీజర్ చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. నాని డిఫరెంట్ లుక్, డైలాగ్స్ ఊర మాస్ ఉన్నాయి. హెయిర్ స్టైల్ అన్ని డిఫరెంట్ లుక్ లో నాని కనిపించబోతున్నాడు. ఎప్పుడు కొత్త పాత్రలో కనిపించే నాని ఈసారి మరో కొత్త లుక్స్ లో రాబోతున్నాడు. ఎవరు ఊహించని విధంగా గ్లింప్స్ ఉన్నాయి. ఒక తల్లి కొడుకు గురించి చెప్పడం అనేది చాలా కొత్త ఐడియాతో గ్లింప్స్ స్టార్ట్ అయ్యాయి. చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు. కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా నుంచి మాట్లాడే శవాల కథ అని, కాకుల గురించి స్టోరీ చెబుతుంది.
గ్లింప్స్‌లోని ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం. గ్లింప్స్ మొత్తం చూస్తే సినిమా అనేది చాలా డిఫరెంట్ స్టోరీ అనిపిస్తుంది. నానికి అసలు ఫెయిల్యూర్స్‌తో సంబంధమే లేదు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వరుస హిట్‌లతో దూసుకెళ్తున్నాడు. అయితే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ ప్యారడైజ్ సినిమా పాత్ర చాలా డిఫరెంట్ ఉంటుంది. మాస్ లుక్‌లో ఇలాంటి ఒక పాత్రకు నాని ఒకే చెప్పడం ఏంటని అందరూ అంటున్నారు. గతంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కామెడీగా వచ్చే సినిమాలకి ఒకే చెప్పేవారు. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉండే పాత్రకు ఒకే చెప్పాడు. ప్రతీ హీరో కూడా వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే నాని ఈ కొత్త ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి కథలు తీసేటప్పుడు ఫేమ్‌ను పట్టించుకోకూడదు. ఇది రిస్క్ అయినదే. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కానుంది. మరి నాని ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి.
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలో నాని కూడా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. వైవిధ్యమైన పాత్రల నటిస్తూ.. వరుస హిట్‌లు నాని సాధిస్తున్నాడు. నాని ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఈగ,ఎవడే సుబ్రమణ్యం,భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ,నేను లోకల్,నిన్ను కోరి,ఎం.సి.ఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి),జెర్సీ,శ్యామ్ సింగ రాయ్,అంటే సుందరానికి,దసరా,హాయ్ నాన్న వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. నాని కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. నాని తెలుగు బిగ్ బాస్ సీజన్ 2కి కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో హిట్ కొట్టిన నాని మళ్లీ హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court: అంచనాలు లేకుండా వచ్చిన కోర్టు మూవీ.. మొదటి రోజే కలెక్షన్లు దుల్లగొట్టిందిగా!
-
Yevade Subramanyam: పదేళ్ల తర్వాత నాని మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
-
The Paradise glimpse: నాని ఊర మాస్ లుక్స్.. ఇదెక్కడి గ్లింప్స్ మావ.. కళ్లు చేదిరే స్టోరీ
-
Hero nani:నేచురల్ స్టార్ నాని రియల్ నేమ్ ఇదే.. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా
-
HIT 3 Teaser: వచ్చేసిన నాని హిట్ 3 టీజర్.. అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ.. వయెలెంట్‌గా మాములుగా లేదుగా..లాఠీకి దొరికినోడి పరిస్థితి…