Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేచురల్ స్టార్ నానికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. నాని మంచి కాన్సెప్ట్‌లను ఎంచుకుంటారు.

Malayalam Movies: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేచురల్ స్టార్ నానికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. నాని మంచి కాన్సెప్ట్‌లను ఎంచుకుంటారు. కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ప్రతీసారి కొత్త కాన్సెప్ట్‌లతో హిట్ కొడుతుంటారు. నాని మూవీలు అంటే చాలా మందికి తప్పకుండా నచ్చుతాయి. నాని మూవీస్‌లో ఎక్కువగా హిట్‌లు ఉంటాయి. అలాగే అందులో ఒక ముఖ్యమైన స్టోరీ కూడా ఉంటుంది. అయితే చాలా మందికి నాని సినిమాలు నచ్చుతాయి. కానీ నానికి కూడా కొన్ని ఫేవరేట్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు నానికి చాలా ఇష్టం. అయితే నానికి మలయాళం సినిమాలు కొన్ని అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలకు నాని ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని ఇటీవల తెలిపాడు. నాని నటించిన హిట్ 3 మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని తనకి ఇష్టమైన మలయాళ మూవీస్ గురించి చెప్పారు. అయితే నానికి నచ్చిన ఆ మలయాళ మూవీస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
హీరో నానికి మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ట్రాన్స్ మూవీ అంటే చాలా ఇష్టమట. ఈ సినిమా చూసిన తర్వాతే తాను మలయాళ ఇండస్ట్రీ సినిమాల వైపు ఆకర్షితులు అయినట్లు వెల్లడించారు. అయితే 2020లో రిలీజ్ అయిన ఈ మూవీ నానికి చాలా నచ్చింది. అయితే కోవిడ్ సమయంలో కాస్త ఫ్రీ దొరకడంతో నాని ఎక్కువగా సినిమాలు చూశారు. ఈ క్రమంలో ఫహాద్ ఫాజిలే నటించిన సినిమాలు చూశారు. అయితే అప్పటి నుంచి మలయాళంలో వచ్చిన అన్ని సినిమాలు కూడా చూస్తున్నారు. అయితే హీరో నానికి కుంబలంగి నైట్స్, ఆవేశం నచ్చాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన బెంగళూరు డేస్, మంజుమ్మెల్ బాయ్స్, మమ్ముట్టి నటించిన భీష్మ పర్వం, కన్నూర్ స్క్వాడ్, మోహన్ లాల్ నటించిన లూసిఫర్ వంటి సినిమాలు బాగా నచ్చాయని హీరో నాని ఇటీవల చెప్పారు. అన్నింటి కంటే ఫహాద్ నటించిన ట్రాన్స్ మూవీ బాగా నచ్చిందని, ఈ సినిమాతో ఫ్లాట్ అయిపోయానని తెలిపారు.
Read Also: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
ట్రాన్స్ అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను అన్వర్ రషీద్ డైరెక్ట్ చేయగా.. విన్సెంట్ వడక్కన్ దీనికి కథ అందించాడు. ఇందులో ఓ నాస్తికుడిని క్రిస్టియన్ పాస్టర్‌గా మార్చేసి.. అలా కోట్లు గడిస్తారు. ఇలా ఓ నకిలీ ఏజెన్సీ చుట్టూ కథ ఉంటుంది. అయితే చాలా మంది పాస్టర్లను నమ్మి ఎలా మోసపోతున్నారనే విషయాన్ని ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. పూర్తిగా దేవుడిని నమ్మని ఓ వ్యక్తి.. పాస్టర్‌గా మారి కోట్లు ఎలా సంపాదించాడనేది చూపిస్తారు. ఇందులో ఫహాద్ పిచ్చి ఎక్కించేశాడు. సూపర్‌గా నటించాడు. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..