Sharwanand: శర్వానంద్ పని అయిపోయినట్లేనా.. సినిమా రిలీజ్‌లు ఇక కష్టమే?

Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్ క్యారక్టర్ రూల్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్‌కు దగ్గర అయ్యాడు. మంచి సినిమాలు చేస్తూ నేచురల్ స్టార్ నానితో పాటు ఈక్వెల్‌గా హీరోగా ఎదిగాడు. స్టోరీ ఉన్న సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో మంచి రేంజ్‌కి వెళ్తున్నాడని అనుకునే సమయంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. చేసిన సినిమాలు ఫ్లాప్స్ రావడంతో శర్వానంద్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఇటీవల శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీని కంటే ముందు ‘ఒకే ఒక జీవితం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ శర్వానంద్ కెరీర్‌ను పెంచేంత విధంగా అయితే హిట్ కాలేదు. వీటి కంటే ముందు రిలీజ్ అయిన మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు, శ్రీకారం, జాను ఇలా అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
పెద్దగా ఈ సినిమాలు హిట్ కాలేదు. దీంతో శర్వానంద్ కెరీర్ ఇక ఆగిపోయినట్లేనని మాటు వినిపిస్తున్నాయి. శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ సినిమా కాస్త హిట్ అయ్యింది. దీని తర్వాత వచ్చిన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. సాధారణంగానే ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా వరుస ఫ్లాప్‌లు రావడంతో ఇంకా శర్వానంద్‌కు తక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం శర్వా మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బరాజుతో ‘నారి నారి నడుమ మురారి’, మరొకటి ‘లూసర్’ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నారు.
సంపత్ నంది దర్శకత్వం లో ‘భోగి’ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ కూడా రెండు షెడ్యూల్స్ అయ్యాయి. అయితే భైరవం మూవీ నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భైరవం కలెక్షన్లు రాకపోవడం వల్ల నష్టపోయారు. దీంతో ఈ సినిమాను ఆపినట్లు తెలుస్తోంది. మిగతా రెండు సినిమాలు కూడా ఎక్కువ బడ్జెట్ కావడం వల్ల అవి షూటింగ్ ఆపినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శర్వానంద్ మార్కెట్ కూడా బాగా పడిపోయింది. దీంతో మిగతా సినిమాలు కూడా రిలీజ్ కావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సినిమాలు రిలీజ్ చేశాక మళ్లీ నష్టాలు వస్తే ఇబ్బంది అని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో మళ్లీ వీటిని షూటింగ్ చేసి రిలీజ్ చేస్తే ఇంకా నష్టాలు వస్తాయి ఏమోనని భయపడుతున్నారు. మరి శర్వానంద్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.
-
Kota Srinivasa Rao: శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ.. విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి
-
Actress: పెళ్లయిన 15 రోజులకే భర్త.. 25 ఏళ్లకే సినిమాకు గుడ్ బై.. ఆ నటి ఎవరంటే?
-
Movies: మదర్ సెంటిమెంట్‌తో తెలుగులో వచ్చిన మూవీస్ ఇవే
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Arjun Reddy: అర్జున్ రెడ్డి హిట్‌ను మిస్ చేసుకున్న ఇద్దరు హీరోలు.. చేసి ఉంటే వారి లెవెల్ వేరేలా ఉండేదేమో!