Actress: పెళ్లయిన 15 రోజులకే భర్త.. 25 ఏళ్లకే సినిమాకు గుడ్ బై.. ఆ నటి ఎవరంటే?

Actress: ఒకప్పుడు ఎందరో హీరోయిన్లు సినిమాల్లో నటించి తర్వాత మరి నటించని వారు చాలా మంది ఉన్నారు. వారిలో కనక ఒకరు. ఈమె తమిళ సినిమా చరిత్రలో ఒక ప్రముఖ నటి. దర్శకుడు ఎ. బీమ్సింగ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి దేవదాస్‌ను ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె నటిగా చాలా సినిమాల్లో నటించింది. కరకట్టకారన్ సినిమా ద్వారా హీరోయిన్‌గా కనక ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. మొదటి సినిమానే హిట్ కావడంతో రజనీకాంత్, రామరాజన్, ప్రభు, కార్తీక్, విజయకాంత్, మమ్ముట్టి వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించింది. ఒక్కసారిగా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తన 16 ఏళ్ల వయస్సులోనే సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. పదేళ్ల పాటు సిని ఇండస్టీలో కెరీర్‌ను కొనసాగించింది. 26 ఏళ్ల వయస్సులో తన సినీ కెరీర్‌ను కనక ముగించింది.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
కనక 1980లో స్టార్ నటిగా కొనసాగడంతో చాలా ఏళ్లు సినీ ఇండస్ట్రీలో ఉంటుందని భావించారు. కానీ ఒక్కసారి అకస్మాత్తుగా సినిమాలను ఆపేసింది. చిత్ర పరిశ్రమ నుంచి సడెన్‌గా వెళ్లిపోవడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. అయితే కనక తల్లి, తండ్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయినా కూడా 3 ఏళ్లకే విడిపోయారు. ఈ క్రమంలో కనక తండ్రి దగ్గర కాకుండా తల్లి దగ్గర పెరిగింది. కనక తల్లి దగ్గరే పెరిగింది. అయితే కనక అమ్మ 2002లో అకస్మాత్తుగా మరణించింది. తల్లి మరణించడంతో కనక ఒంటరిగానే ఉండిపోయింది. అయితే ఈ సమయంలో 2007లో కనక కాలిఫోర్నియాకు చెందిన ఒక ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
కనక పెళ్లి అయిన 15 రోజులకే భర్త కనిపించకుండా వెళ్లిపోయాడని కనక ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పటి నుంచి తన భర్త జాడ కనిపించలేదని వెల్లడించింది. ప్రస్తుతం కనకకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఏకాంతంగా ప్రపంచానికి దూరంగా ఉంటుంది. అయితే కొన్నేళ్ల కిందట నటి కుట్టి పద్మిని కనకతో ఓ ఫొటో తీసుకుంది. అప్పట్లో అది వైరల్ అయ్యింది. గుర్తు పట్టలేనంతగా కనక బరువు పెరిగింది. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో కూడా తెలియదు. స్టార్ హీరోయిన్‌గా ఉండాల్సిన కనక ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియకుండా పోయింది.