Movies: మదర్ సెంటిమెంట్‌తో తెలుగులో వచ్చిన మూవీస్ ఇవే

Movies: కొత్త ప్రపంచానికి పిల్లలను పరిచయం చేసి తల్లి తన కష్టాలను పక్కన పెట్టి మరి పెంచుతుంది. చిన్నతనం నుంచి పెద్దయ్యే వరకు వారికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండేలా చూసుకుంటుంది. తాను కష్టపడి అయిన పిల్లలను సుఖ పెడుతుంది. ఇలా తల్లి ప్రేమను చాటి చెప్పే సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులో తల్లి సెంటిమెంట్‌తో సినిమాలు ఎక్కువగానే వచ్చిన అందులో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఏదో ఎమోషనల్‌గా ఉంటే.. మరికొన్ని మాత్రం అమ్మ ప్రేమతో కట్టిపడేస్తాయి. ఆ సినిమాలు చూస్తున్న అంత సమయం కూడా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఏడవకుండా ఎవరూ కూడా సినిమాలు చూడలేరు. ఇలాంటి సినిమాను మదర్స్ డే రోజు టీవీల్లో ఇస్తుంటారు. అయితే మే రెండవ ఆదివారం 11వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే మదర్స్ డే రోజున మీ అమ్మకు సినిమాను డెడికేట్ చేయండి. అప్పుడు మీ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మదర్ సెంటిమెంట్‌తో తెలుగులో వచ్చిన ఆ మూవీస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మాతృదేవోభవ (1993)
ఈ సినిమాలో తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ, తన పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందే కథాంశం చూపారు. మాధవి తల్లి పాత్ర పోషించింది. ఈ సినిమా చూసి ఏడవకుండా ఉండని వారంటూ ఎవరూ ఉండరు.
సింహరాశి (2001) & పెదబాబు (2004)
రాజశేఖర్ హీరోగా నటించిన ‘సింహరాశి’ తమిళ చిత్రం ‘మాయి’కి రీమేక్. తల్లి ప్రేమ ఆధారంగా సాగిన కథ. ‘పెదబాబు’లో జగపతిబాబు తల్లి ప్రేమకు దూరం అవుతాడు. ఈ రెండు సినిమాల్లో కూడా మదర్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది.
గుంటూరు కారం (2024)
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వచ్చిన ఈ మూవీ మదర్ సెంటిమెంట్ మీద వచ్చింది. కానీ పెద్దగా మదర్ ఎమోషన్‌ను అయితే పండించలేదు. మహేష్ బాబుకి తల్లిగా రమ్యకృష్ణ నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు.
ఒకే ఒక జీవితం (2022)
శర్వానంద్ హీరోగా నటించిన ట్రావెల్ థీమ్‌లో వచ్చిన ఒకే ఒక జీవితం మదర్ సెంటిమెంట్‌తో వచ్చింది. ఈ సినిమా తల్లి ప్రేమతో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. చిన్నప్పుడే తల్లిన కోల్పోయిన యువకుడు, టైమ్ మెషిన్ ద్వారా ఎలా తల్లి ప్రేమను పొందుతాడనే స్టోరీలో వచ్చింది. ఈ సినిమా మదర్ సెంటిమెంట్‌తో బాగా వర్క్‌వుట్ అయ్యిందని చెప్పవచ్చు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌గా ఉంటుంది. ఇందులో అన్ని బంధాలు, ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమా కూడా తల్లి ప్రేమను తెలియజేసేది. తల్లి పాత్రలో అమలు నటించింది. ఈ సినిమా మంచి హిట్ సాధించింది.
అమ్మ చెప్పింది (2006)
శర్వానంద్ నటించిన ఈ చిత్రంలో, సుహాసిని తల్లి పాత్ర పోషించారు. మానసిక వికాసం లేని తన కొడుకును, దేశాన్ని ఉగ్రదాడుల నుండి రక్షించేందుకు తల్లి చేసే త్యాగం ఇతివృత్తం.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
రవితేజ, అసిన్ నటించిన ఈ మూవీ మదర్ సెంటిమెంట్‌లో వచ్చింది. మదర్ సెంటిమెంట్ అయితే ఇందులో వర్క్‌వుట్ అయ్యింది.