Arjun Reddy: అర్జున్ రెడ్డి హిట్‌ను మిస్ చేసుకున్న ఇద్దరు హీరోలు.. చేసి ఉంటే వారి లెవెల్ వేరేలా ఉండేదేమో!

Arjun Reddy:
సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించారు. హీరోయిన్‌గా షాలినీ పాండే నటించింది. ఈ సినిమాతో విజయ్‌కి భారీగా ఆఫర్లు వచ్చాయి. ఒక్కసారిగా విజయ్ క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాతో విజయ్‌తో పాటు సందీప్ వంగాకి కూడా మంచి ఛాన్స్‌లు వచ్చాయి. విజయ్ కెరీర్‌ను అర్జున్ రెడ్డి సినిమా మలుపు తిప్పింది. బాలీవుడ్‌లో ఇది కబీర్ సింగ్‌గా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించింది. అయితే సందీప్ వంగా ఈ సినిమా స్టోరీని ముందుగా ఇద్దరు హీరోలకు చెప్పారు. కానీ వారు ఈ స్టోరీకి నో చెప్పడంతో చివరకు రౌడీ బాయ్‌ను సంప్రదించారు. విజయ్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అని కూడా చెప్పవచ్చు. అయితే అర్జున్ రెడ్డి మూవీకి నో చెప్పిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
సందీప్ వంగా అర్జున్ రెడ్డి పాత్రకు ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంప్రదించారట. బన్నీకి కథ చెప్పడంతో అతను నో చెప్పారు. అయితే బన్నీకి కథ అయితే నచ్చింది. కానీ లవ్ స్టోరీ సెట్ కాదు ఏమోనని బన్నీ రిజక్ట్ చేశాడట. ఆ తర్వాత సందీప్ వంగా మరో యంగ్ హీరోకి కూడా కథ చెప్పారు. అతనే శర్వానంద్. ఇతనికి కూడా సందీప్ వంగా స్టోరీ చెప్పాడు. శర్వానంద్ నో చెప్పడంతో చివరకు రౌడీ బాయ్‌ని సందీప్ వంగా సంప్రదించాడు. విజయ్ ఈ సినిమాకి ఒకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందే తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో వరుస ఆఫర్లు విజయ్‌కి వచ్చాయి. సినిమా కూడా మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. యూత్‌కి ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.