Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?

Sandeep Reddy Vanga :
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి సందీప్ రెడ్డి వంగ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలను చూడడానికి అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అందువల్లే ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ట్ డైరెక్టర్ గా ఒక మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు…
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) ఈ సినిమా తర్వాత అలాంటి ఒక ఎఫెక్టివ్ మేకింగ్ తో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి కావడం విశేషం. అందువల్ల ఈ సినిమాకు ఎనలేని గుర్తింపు అయితే వచ్చింది సందీప్ రెడ్డివంగ లాంటి స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఇలాంటి సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
ఆయన చేసిన అనిమల్ (Animal) సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ఈ మూవీ 900 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలామంది అభిమానులు చాలావరకు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ధోనీతో ఆడ్ ఫిల్మ్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఆడ్ ఫిల్మ్ కి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా అనిమల్ గెటప్ లో ధోనిని చూపించి ప్రతి ఒక్కరిని షాక్ గురి చేశాడు. ఇక పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ ఒక సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆడ్ ఫిలిమ్స్ కోసం 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన నుంచి ఒక సినిమా రావాలన్న ఆడ్ ఫిల్మ్ రావాలన్న భారీ ఎత్తున ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించే విధంగా తనను తాను మౌల్డ్ చేసుకున్న విధానం అయితే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నిజానికి సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. బోల్ట్ కంటెంట్ తో సినిమాలను చేసి కూడా సూపర్ సక్సెస్ గా నిలపవచ్చు అనే సంకల్పంతో ముందుకు సాగిన సందీప్ తన తదుపరి సినిమాల విషయాల్లో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారట…
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
MS Dhoni and Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్న ధోని… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…