RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

RGV Sensational Comments: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ తీస్తున్నారు. అయితే ఈ మూవీలో ఫస్ట్ దీపికా పదుకుణే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత కొన్ని ఇష్యూలు రావడంతో దీపికాను తప్పించి త్రిప్తి డిమ్రీకి ఛాన్స్ ఇచ్చారు. అయితే సందీప్ రెడ్డి వంగా మూవీ నుంచి దీపికా తప్పుకోవడానికి ముఖ్య కారణం 8 గంటల షిఫ్ట్ డిమాండ్ అని జోరుగా ప్రచారం సాగింది. దీపికా దీనికి అంగీకరించకపోవడం వల్ల ఈ సందీప్ సినిమాకు ఒప్పుకోలేదని, అలాగే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా డిమాండ్ చేసిందని కారణాలు వినిపించాయి. అయితే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మీద తీవ్రంగా చర్చ సాగింది. దీనిపై ఇప్పుడు దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ షిఫ్ట్‌ల గురించి మాట్లాడారు. ఎవరైనా నటీనటులకు షిఫ్ట్ టైమింగ్స్ ఫిక్స్ చేస్తే, అది ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం అని అనుకుంటాను. అయితే ఎవరికి ఏం కావాలని చెప్పే రైట్స్ ప్రతీ ఒక్కరికి ఉన్నాయి. వారికి కావాల్సిన దానిని చెప్పేటప్పుడు.. ఎదుటి వారికి తిరస్కరించే హక్కు కూడా ఉందని ఆర్జీవీ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్జీవీ తెలిపారు. తాను రోజంతా పని చేయాలని అనుకుంటారట. అదే ఇంకో నటుడు కేవలం గంట మాత్రమే పనిచేయాలని అనుకుంటాడు. ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం. వారికి నచ్చినట్లు ఉండే హక్కు ఉంటుందని ఆర్జీవీ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదెలా ఉండగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శారీ అనే మూవీ గత నెల 27వ తేదీన ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆర్జీవీ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సందీప్ వంగా, దీపికా పదుకుణే షిఫ్ట్ అవర్స్ గురించి మాట్లాడారు. అయితే వీరిద్దరి మధ్య మాటల మధ్య యుద్ధం జరిగింది. దీపికా పదుకుణే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, 8 గంటలు పనిచేయనని, అలాగే తెలుగులో డైలాగ్‌లు చెప్పనని డిమాండ్ చేసింది. దీంతో సందీప్ వంగా ఆమెను మూవీ నుంచి తొలగించారు. ఈమెకు ముందు స్టోరీ చెప్పడంతో దీపికా స్టోరీ లీక్ చేసిందని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై కూడా సందీప్ వంగా స్పందించారు. ఇలా సినిమా స్టోరీ లీక్ చేయడమా మీ ఫెమినిజం అంటే సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఎన్నిసార్లు సినిమా స్టోరీ మీరు లీక్ చేసిన పర్లేదనని అన్నారు. దీనిపైన రాం గోపాల్ వర్మ ఇటీవల స్పందించారు.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Prakash Raj: కోట శ్రీనివాస రావు అందరికీ నచ్చలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!