Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్లో మెరిసిన భారత ఆణిముత్యం

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. అమెరికాలోని హాలీవుడ్లో ఉండే ‘వాక్ ఆఫ్ ఫేమ్’ (Walk of Fame) లో ఆమెకు ఒక స్థానం దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటి దీపికానే కావడం గమనార్హం. ఇది మన భారతీయ సినిమాకు గర్వకారణంగా చెప్పొచ్చు.
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటి?
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అంటే, లాస్ ఏంజిల్స్ నగరంలో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుపై నక్షత్రాల ఆకారంలో కొన్ని పలకలు ఉంటాయి. ఆ పలకలపై గొప్ప నటీనటుల, ప్రముఖుల పేర్లు ఉంటాయి. సినిమా, టీవీ, సంగీతం లాంటి రంగాల్లో బాగా కష్టపడిన వారికి ఈ గౌరవం ఇస్తారు. ఇప్పుడు ఈ నక్షత్రాల మధ్య దీపికా పదుకొణె పేరు కూడా చేరబోతోంది.
Read Also:Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
దీపికా పేరు ఎప్పుడు చేరుతుంది?
దీపికా పదుకొణె పేరును ‘మోషన్ పిక్చర్’ విభాగంలో సెలక్ట్ చేశారు. 2026వ సంవత్సరంలో ఆమె పేరును ఆ నక్షత్రంపై చెక్కుతారు. ఈసారి దీపికాతో పాటు, ఎమిలీ బ్లంట్ లాంటి కొందరు ప్రముఖులు కూడా ఈ గౌరవాన్ని పొందారు. ప్రతి సంవత్సరం చాలా పేర్లు వచ్చినా కేవలం 20 నుంచి 24 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ నక్షత్రాన్ని తయారు చేసి రోడ్డుపై పెట్టడానికి దాదాపు 75 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ డబ్బును దీపికా పేరును ఎవరు సూచించారో వారే చెల్లిస్తారు.
దీపికా నెక్ట్స్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం దీపికా గర్భవతి కావడంతో సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నారు. త్వరలోనే ఆమె మళ్ళీ షూటింగ్‌లకు రాబోతున్నారు. అల్లు అర్జున్ సరసన అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తారు. అలాగే, షారుఖ్ ఖాన్ తో కలిసి ‘కింగ్’ సినిమాలో, ‘కల్కి 2898 AD’ సెకండ్ పార్టులో కూడా దీపికా పదుకొణె కనిపించబోతున్నారు.
Read Also:Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Allu Arjun-Atlee Movie Shooting: అల్లు అర్జున్-అట్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే మూవీ షూటింగ్!
-
Barkha Madan : గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసినిగా మారిన టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?
-
Aamir Khan : కేవలం 8 నిమిషాలకే రూ. 30 కోట్లు..రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ కామియోరోల్
-
Shobana : చెట్టు వెనుకకు వెళ్లి బట్టలు మార్చుకోమన్నారు.. సీనియర్ నటి ఆవేదన
-
Rashmika :కెరీర్లోనే చేయని గ్లామరస్ పాత్ర.. ‘కాక్ టెయిల్ 2’లో రష్మికను చూస్తే నిద్రపట్టదట
-
Deepika Padukone : ఆమె డిమాండ్లలో తప్పేలేదు.. దీపిక పదుకొణేకు మద్దతు పలికిన అజయ్ దేవ్ గన్