Allu Arjun-Atlee Movie Shooting: అల్లు అర్జున్-అట్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే మూవీ షూటింగ్!

Allu Arjun-Atlee Movie Shooting: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రాబోతున్న AA22 మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబైలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా మూడు నెలల పాటు ఇక్కడ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీఎఫ్‌ఎక్స్ కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీపై అధికారికంగా ప్రకటన చేశారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు ఓ వీడియో ద్వారా మూవీ టీం ఇటీవల అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో దీపికా నటించారు. ఇప్పుడు మరోసారి డైరెక్టర్-హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అయితే అల్లు అర్జున్, దీపికా పదుకొణే కలిసి నటించడం ఇదే మొదటిసారి. దీపికా పదుకొణే సినిమాలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియోను చూస్తే, ఆమె ‘వారియర్ ప్రిన్సెస్’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోషన్ పిక్చర్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆమెకు సంబంధించిన కొన్ని షాట్స్ కూడా తీసినట్లు సమాచారం. ఈ సినిమాలో దీపికాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో త్రిపుల్ రోల్ (మూడు పాత్రలు) పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్ర తండ్రి క్యారెక్టర్ అయితే, మిగిలిన రెండు క్యారెక్టర్లు అన్నదమ్ములు అని, వారిలో ఒకరు హీరోగా, మరొకరు విలన్‌గా కనిపించనున్నారని టాక్. దీపికాతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయితే మాత్రం తప్పకుండా ఫస్ట్ సింగిల్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అప్టే్డ్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం
-
HPCL: భారీగా ఉద్యోగాలు.. ఒక్కోసారి జాబ్ వస్తే లైఫ్ సెట్
-
Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Flight Journey: విమాన ప్రయాణం.. భయం భయం..
-
Viral Video : తాగింది దిగేలా చేయాలి ఇలాంటి వాళ్లకు.. మహిళా కోచ్ లో ప్యాంట్ జిప్ తిసే ప్రయత్నం.. వీడియో వైరల్
-
Apple : ముంబైలో యాపిల్ కొత్త స్టోర్ – బెంగళూరులోనూ ప్లాన్.. అద్దె ఎంతో తెలిస్తే గుండె దడేల్ అనాల్సిందే