HPCL: భారీగా ఉద్యోగాలు.. ఒక్కోసారి జాబ్ వస్తే లైఫ్ సెట్

HPCL: ఉద్యోగాల కోసం ఎందరో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ వచ్చినా సరే వెంటనే అప్లై చేసి ఉద్యోగం పొందాలని భావిస్తున్నారు. అయితే ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 372 పోస్టులు ఉన్నాయి. వీటికి కనుక అప్లై చేసుకున్న తర్వాత జాబ్ వస్తే ఇక లైఫ్ సెట్. అయితే ఈ మొత్తం పోస్టుల్లో వివిధ రకాలు ఉన్నాయి. వారి అర్హతను బట్టి ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. మొత్తం ఖాళీల్లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు 10, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 50, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే 19 ఉన్నాయి. ఇక ఇంజినీర్ పోస్టులు 35, సీఏ పోస్టులు 24, ఆఫీసర్ పోస్టులు 6, ఇంజినీర్ పోస్టులు 98, ఇంజినీర్ కెమికల్ పోస్టులు 26, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ పోస్టులు ఒకటి, ఇంజినీర్ సివిల్ పోస్టులు 16, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 15, మేనేజీరియల్ పోస్టులు మొత్తం 72 ఉన్నాయి. అయితే మీ అర్హతను బట్టి పోస్టులకు అప్లై చేసుకోవాలి.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే మూడేళ్ల రెగ్యులర్ సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే బీఎస్సీ కెమిస్ట్రీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ పోస్టులకు మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు నాలుగేళ్ల ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ. చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, 50 శాతం మార్కులతో సీఏ పాస్ అయి ఉండాలి. ఇక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కూడా ఉండాలి. ఇంజినీర్ మెకానికల్ పోస్టులకు అయితే నాలుగేళ్ల మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇంజినీర్ కెమికల్ పోస్టులకు అయితే కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉండాలి.
మేనేజీరియల్‌లో అయితే మెకానికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, కెమికల్, పాలిమర్, ప్లాస్టిక్స్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే వివిధ విభాగాల్లో పనిచేసి 9 నుంచి 18 ఏళ్ల వరకు అనుభవం ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ జనరల్ అభ్యర్థులు అయితే 65 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అయితే 55 శాతం సరిపోతుంది. ఇంజినీరింగ్ పోస్టులకు 25 సంవత్సరాలు, మేనేజీరియల్ ఉద్యోగాలకు 45 ఏళ్లు మించకూడదు. వీటికి దరఖాస్తు ఫీజు రూ.1180 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అసలు ఫీజు లేదు. పోస్టును బట్టి పరీక్ష ఉంటుంది. దీని బట్టి ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, నెట్ స్కోర్, టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్ట్, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ వంటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30వ తేదీ. అధికారిక వెబ్‌సైట్ http://www.hindustanpetroleum.com/careers లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా
-
Allu Arjun-Atlee Movie Shooting: అల్లు అర్జున్-అట్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే మూవీ షూటింగ్!
-
Jobs : ఇంజనీర్లకు గుడ్ న్యూస్.. రూ.25వేల స్టైఫండ్ తో ప్రసార భారతిలో 421 ఉద్యోగాలు
-
Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Flight Journey: విమాన ప్రయాణం.. భయం భయం..
-
Viral Video : తాగింది దిగేలా చేయాలి ఇలాంటి వాళ్లకు.. మహిళా కోచ్ లో ప్యాంట్ జిప్ తిసే ప్రయత్నం.. వీడియో వైరల్
-
Apple : ముంబైలో యాపిల్ కొత్త స్టోర్ – బెంగళూరులోనూ ప్లాన్.. అద్దె ఎంతో తెలిస్తే గుండె దడేల్ అనాల్సిందే