Jobs : ఇంజనీర్లకు గుడ్ న్యూస్.. రూ.25వేల స్టైఫండ్ తో ప్రసార భారతిలో 421 ఉద్యోగాలు

Jobs : ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన ప్రసార భారతి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన (temporary basis) మాత్రమే భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఆరు జోన్లలో అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, న్యూఢిల్లీ, ఈశాన్య జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నికల్ ఇంటర్న్‌ల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 1, 2025లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు, అర్హతలు
మొత్తం పోస్టులు: 421
జోన్ల వారీగా ఖాళీలు:
దక్షిణ జోన్లో టెక్నికల్ ఇంటర్న్‌ల పోస్టులు: 63
తూర్పు జోన్లో టెక్నికల్ ఇంటర్న్‌ల పోస్టులు: 65
పశ్చిమ జోన్లో టెక్నికల్ ఇంటర్న్‌ల పోస్టులు: 66
ఈశాన్య జోన్లో టెక్నికల్ ఇంటర్న్‌ల పోస్టులు: 126
న్యూఢిల్లీలో టెక్నికల్ ఇంటర్న్‌ల పోస్టులు: 101
Read Also:Viral Video : ఇంట్లోనే ఊటీ లాంటి చల్లదనం.. వైరల్ అవుతున్న రూఫ్‌టాప్ కూలర్
అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో కనీసం 65శాతం మార్కులతో పాసైన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 2024-25 సంవత్సరంలో ఫ్రెషర్ గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: అభ్యర్థుల వయోపరిమితి 30 సంవత్సరాలు మించరాదు.
ఎంపిక ప్రక్రియ, స్టైఫండ్!
దరఖాస్తు ప్రారంభం: జూన్ 16, 2025 నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
చివరి తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు జులై 1, 2025లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
ఇంటర్న్‌షిప్ వ్యవధి: ఎంపికైన వారికి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
స్టైఫండ్: ఈ ఒక సంవత్సరం కాలంలో సెలక్ట్ అయిన ఇంటర్న్‌లకు నెలకు రూ.25,000 స్టైఫండ్ గా చెల్లిస్తారు. ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు.
Read Also:Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్
ఎలా దరఖాస్తు చేయాలి?
* ముందుగా ప్రసార భారతి అధికారిక వెబ్సైట్ prasarbharati.gov.in ఓపెన్ చేయాలి.
* హోమ్‌పేజీలో రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్లి, సంబంధించిన నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.
* ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
* అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
* చివరగా, దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక మంచి కెరీర్ అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక
-
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్