Viral Video : ఇంట్లోనే ఊటీ లాంటి చల్లదనం.. వైరల్ అవుతున్న రూఫ్‌టాప్ కూలర్

Viral Video : నార్తిండియాలో భయంకరమైన ఎండలు ప్రస్తుతం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూ ఉండడంతో ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి తన ఇంటి పైకప్పుపై ఒక వినూత్నమైన కూలర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. దీని వల్ల ఏసీ లేకుండానే ఇల్లు ఊటీలాగా చల్లగా మారుతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. ఇంటి పైకప్పులో ఒక ఖాళీ ప్రదేశంలో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ టైల్స్ సహాయంతో ఒక చిన్న ట్యాంక్‌ను నిర్మించి అందులో నీటిని నింపారు. ట్యాంక్ చుట్టూ కూలింగ్ ప్యాడ్‌లను కూడా అమర్చారు. పంప్ సహాయంతో ఈ ప్యాడ్‌లను తడుపుతున్నారు. ఈ వినూత్న కూలర్‌కు పైనుంచి ఓ మూత కూడా పెట్టారు. దీని వల్ల ఇల్లు ఏసీలాగా చల్లగా ఉంటుందని వీడియోలో చెబుతున్నారు. ఈ కొత్త తరహా కూలర్‌ను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Also:Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్
View this post on Instagram
@taarik_ansari అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు కోట్ల మందికి పైగా చూశారు. యూజర్ తన క్యాప్షన్‌లో ‘ఏసీ’ని ట్యాగ్ చేశారు. దీన్ని ఏసీకి ఆల్టర్నేటివ్ గా చూపిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ వీడియో పై ఇంటర్నెట్ పబ్లిక్ అభిప్రాయాలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. చాలా మంది దీన్ని చూసి నవ్వుకుంటున్నారు. క్యా టెక్నాలజీ మామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ
సాధారణంగా ఏసీలు, కూలర్ల వాడకం వేసవిలో బాగా పెరుగుతుంది. కానీ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత దాటిన తర్వాత అవి కూడా తమ కెపాసిటీ కోల్పోతాయి. కూలర్ సరిగ్గా పనిచేయాలంటే గాలి పొడిగా, తేమ తక్కువగా ఉండాలి. ఒకవేళ గాలిలో తేమ ఎక్కువగా ఉంటే, కూలర్ చల్లదనాన్ని ఇవ్వడానికి బదులు వేడి గాలిని ఇస్తుంది. అందుకే పైన ప్రయోగం చాలా కొంతవరకు సక్సెస్ కాదని నెటిజన్లు చెబుతున్నారు.
Read Also:Skin Tips: రోజూ తినే ఈ ఫుడ్ వాటర్ యూజ్ చేస్తే.. అందం అమాంతం పెరిగిపోవడం ఖాయం
-
Instagram New Feature: ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్ విడుదల
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం