Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్

Kidney Issues: మారిన జీవనశైలి వల్ల చాలా మంది కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, సరిగ్గా వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ శాతం మంది ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కొన్ని రకాల పదార్థాలను డైలీ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. పోషకాలు, విటమిన్లు ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా ఈజీగా తీరిపోతాయి. అయితే కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
బాటిల్ గోర్డ్
నీటి శాతం ఎక్కువగా ఉండే దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగిస్తుంది. దీన్ని సలాడ్ లేదా జ్యూస్, కూరలు ఇలా ఏ విధంగా అయినా కూడా తీసుకోవచ్చు. డైలీ కాకపోయినా వారానికి ఒకటి లేదా రెండు రోజులు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు అసలు రావు.
కొత్తిమీర
కొందరికి కొత్తిమీర కూరల్లో వేస్తే ఇష్టం ఉంటుంది. మరికొందరికి అసలు ఇష్టం ఉండదు. అయితే దీన్ని ఏదో విధంగా తినడం వల్ల బాడీలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా కిడ్నీలో ఉన్న వేస్ట్ అంతా కూడా ఈ కొత్తిమీర వల్ల బయటకు వెళ్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే కొత్తిమీరను కేవలం వంటల్లో వేయడమే కాకుండా పచ్చళ్లు, డ్రింక్‌లు వంటి వాటిలో కూడా కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పసుపు
యాంటి బయోటిక్ అయిన పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా పసుపుతో తగ్గిపోతాయి. పసుపును వంటల్లో తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. ఈ పసుపు మూత్రపిండాల కణజాలాలలో వాపును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పసుపులో ఎక్కువగా కర్కుమిన్ ఉంటుంది. ఇది నిద్రలేమి, చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష
వీటిలో ఫ్లేవనాయిడ్లు, రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంతో పాటు మూత్రపిండాల్లోని కణాలను తగ్గిస్తాయి. దీంతో కిడ్నీ సమస్యలు అసలు రావు. ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. యంగ్ లుక్‌లో ఉండటానికి ఈ ఎరుపు ద్రాక్ష బాగా ఉపయోగపడతాయి.
కాలీఫ్లవర్
ఇందులో తక్కువ పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీన్ని కూర లేదా స్నాక్స్ టైప్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Model San Rachel: మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ సూసైడ్.. నల్లగా ఉన్నావని విమర్శలే కారణమా?
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Curd: పెరుగు మిగిలిపోయి వేస్ట్ కావద్దంటే.. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందమే అందం
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?