Curd: పెరుగు మిగిలిపోయి వేస్ట్ కావద్దంటే.. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందమే అందం

Curd: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్ని కూరలతో ఫుడ్ కంప్లీట్ చేసినా కూడా పెరుగు తినకుండా అసలు తృప్తి అనిపించదు. అయితే కొన్నిసార్లు పెరుగుతో తిన్న తర్వాత ఉండిపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది పడేయక ఏం చేయాలని అనుకుంటారు. ఫ్రిడ్జ్ ఉన్నవారు ఉంచుకుంటే ఏం పర్లేదు. కానీ బయట ఉంచితే ఫంగస్ వస్తుంది. దీన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా మిగిలిపోయిన పెరుగును పడేయకుండా హ్యాపీగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీనివల్ల ముఖం అందంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పెరుగులో ఏవేవి కలిపితే చర్మ ఆరోగ్యం మెరిసిపోతుందో ఈ స్టోరీలో చూద్దాం.
తేనె
పెరుగులో కాస్త తేనె, పంచదార, ఓట్స్ వంటివి కలిపి పేస్ట్ చేసుకోవాలి. వీటిని ముఖానికి పట్టించి ఒక పది నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముడతలు అన్ని కూడా తొలగిపోయి యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు అంటున్నారు.
హెయిర్ మాస్క్
పెరుగును కేవలం చర్మానికి మాత్రమే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో అరటి పండు గుజ్జు కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు మృదువుగా తయారు అవుతుంది. దీన్ని తలకు అప్లై చేసి ఒక అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాతే తల స్నానం చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
మొటిమలు
పెరుగులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే మొటిమలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే కేవలం పెరుగు మాత్రమే కాదు.. ఇందులో పసుపు, తేనె వంటివి కూడా కలపాలని నిపుణులు అంటున్నారు.
ఎండ నుంచి విముక్తి
పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండ నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. వారానికి ఒకసారి లేకపోతే రెండు సార్లు అయినా కూడా ఈ ప్యాక్ ముఖానికి అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎండ వల్ల చర్మంపై ఎలాంటి ముడతలు కూడా పడవు. దీనివల్ల వయస్సు మీతిమీరిన కూడా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అందరిలో మీ ముఖమే చాలా గ్లోగా ఉంటుంది. ఎండ కాలంలో ఈ ప్యాక్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు
-
Stress relief: అందంగా ఉండాలంటే చిట్కాలే కాదు.. ఒత్తిడిని కూడా జయించాల్సిందే
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?
-
Honey: తేనె ఎందుకు పాడవదు.. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?
-
Skin Health: తినే రైస్‌తో చర్మ సౌందర్యం.. ఇలా ప్యాక్ వేసుకుంటే మిస్ వరల్డ్ మీరే
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?