Skin Health: తినే రైస్‌తో చర్మ సౌందర్యం.. ఇలా ప్యాక్ వేసుకుంటే మిస్ వరల్డ్ మీరే

Skin Health: అందంగా ఉండాలని కొందరు ముఖానికి క్రీములు వంటివి రాస్తుంటారు. వీటివల్ల కొంత సమయం అందంగానే కనిపించినా ఆ తర్వాత మాత్రం ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరిలో అందంగా కనిపించాలంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కాదు.. ఇంట్లో ఉన్న వాటితో అందంగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. డైలీ రైస్ అనేది తింటారు. ఆ రైస్‌తో ముఖానికి ప్యాక్ వేసుకుంటే అందంగా మెరిసిపోతారని నిపుణులు చెబుతున్నారు. బియ్యంతో పిండిని తయారు చేసి ముఖానికి డైలీ అప్లై చేసుకుంటే ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు. బియ్యంలోని పోషకాలు చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే బియ్యం పిండిలో కొన్ని రకాల పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది. మరి అవేంటో తెలియాలంటే మీరు ఆర్టికల్ చదవాల్సిందే.
బియ్యం పిండిలో పసుపు, చందనం, నిమ్మరసం, శనగ పిండి, పెరుగు వంటివి కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల ముఖం మెరిసిపోతుంది. బియ్యం పిండిలోని పోషకాలు సూర్యరశ్మి నుంచి రక్షణ కలిగిస్తాయి. దీనివల్ల చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది. అలాగే ముఖంపై ఉండే ట్యాన్‌ను తొలగించి ఫేస్ ఎల్లప్పుడూ కూడా ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. బియ్యం పిండిలో ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై దురద, మచ్చలు, దద్దర్లు వంటివి రాకుండా చేస్తాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే కొందరి చర్మం జిడ్డుగా ఉంటుంది. అప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా కూడా వెంటనే జిడ్డుగా మారుతుంది. ఇలా ఉంటే మాత్రం బియ్యం పిండి ముఖానికి తప్పకుండా అప్లై చేయండి. దీని అప్లై చేస్తే జిడ్డు ముఖం తొలగిపోయి ముఖం ఫ్రెష్‌గా మారుతుంది. అయితే ఈ బియ్యం పాక్‌ను స్నానానికి ముందు చర్మానికి అప్లై చేసి ఆయిల్‌తో క్లీన్ చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్కసారిగా స్కిన్ మెరుస్తుందని నిపుణులు అంటున్నారు.
బియ్యం ఫేస్ ప్యాక్‌లో పసుపు, తేనె, పెరుగు వంటి వాటితో పాటు పాలు కూడా వేయాలి. వీటిని కలిపి ముఖానికి పేస్ట్‌ను పెట్టడం వల్ల ముఖం తక్షణమే మెరుస్తుంది. అయితే ఈ ప్యాక్‌ను 15 నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల మీ చర్మం మెరుగుపడుతుంది. ఎందుకంటే పెరుగు, తేనెలోని పోషకాలు వెంటనే చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కొందరు ఇందులో కాఫీ పౌడర్ కూడా వేస్తుంటారు. కాఫీలోని పోషకాలు చర్మంపై ఉన్న ట్యాన్‌ను తొలగిస్తుంది. వెంటనే తెల్లగా మారేలా చేస్తుంది. కొందరు ఎక్కువగా సూర్యరశ్మిలో తిరుగుతుంటారు. దీంతో చర్మం ట్యాన్‌గా మారుతుంది. ఎన్ని క్రీములు రాసినా కూడా చర్మం నల్లగా, జిడ్డుగా ఉంటుంది. అలాంటి వారు బియ్యం పిండి, కాఫీ పౌడర్, తేనె వంటివి కలిపి ప్యాక్ ముఖానికి అప్లై చేయడం బెటర్ అని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Read Also:Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
-
Curd: పెరుగులో పండ్లు కలిపి తింటే.. వామ్మో ఆరోగ్యానికి ఇంత ప్రమాదమా!
-
Lemon Juice: నిమ్మరసంలో వీటిని కలిపి తాగితే.. జీవితాంతం ఆరోగ్యం మీకే
-
BTB Juice: ఏబీసీ కాదు.. ఈ జ్యూస్ తాగితే సర్వ రోగాలు పరార్
-
Face Pack: ఇంట్లోనే కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్.. క్షణాల్లో అందం మీ సొంతం