Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
Smartphone : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం ఫోన్ చేసుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి మాత్రమే కాదు. అది మన వ్యక్తిగత జీవితంలో ఒక భాగమైపోయింది. అందులో ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంకింగ్ వివరాలు, ఇంకా చాలా వ్యక్తిగత విషయాలు దాగి ఉంటాయి. అందుకే ఫోన్‌ను పాస్వర్డ్, ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ లాక్ తో చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. కానీ, చాలా సార్లు ఫ్రెండ్స్, అన్న అక్క తమ్ముడు లేదా కుటుంబ సభ్యులు మనకు తెలియకుండానే ఫోన్‌ను ఓపెన్ చేసి అందులో ఏం చూశారోనని భయం వేస్తుంటుంది. వాళ్ళు ఏదైనా పర్సనల్ విషయం చూశారేమో అని కంగారు పడుతుంటాం. అయితే, ఒక సూపర్ ట్రిక్ తో మీ ఫోన్లో ఏ యాప్‌లు ఎప్పుడు, ఎంత సేపు వాడారో తెలుసుకోవచ్చు. ఆ సీక్రెట్ కోడ్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం.
మీ ఫోన్లో ఒక సీక్రెట్ కోడ్ ఉంది. అది మీ మొబైల్ హిస్టరీని మొత్తం ఓపెన్ చేస్తుంది. అంటే, ఏ యాప్‌ను ఎంత సేపు, ఎప్పుడు ఓపెన్ చేశారో మొత్తం చూపిస్తుంది. ఆ సీక్రెట్ కోడ్ : *#*#4636#*#* లేదా కొన్ని ఫోన్లలో ##4636## ను డయల్ చేయాల్సి ఉంటుంది.
Read Also:Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
ఈ కోడ్‌ను ఎలా వాడాలి?
డైలర్లోకి వెళ్లాలి : మీ ఫోన్లో నంబర్లు డయల్ చేస్తారు కదా, ఆ ‘డయలర్’ యాప్‌ను ఓపెన్ చేయాలి.
కోడ్ టైప్ చేయాలి : అక్కడ పైన చెప్పిన కోడ్‌ను టైప్ చేయండి.
సీక్రెట్ పేజ్ ఓపెన్ : మీరు కోడ్ టైప్ చేయగానే, దానంతట అదే ఒక సీక్రెట్ సెట్టింగ్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ ముందు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అవి ఫోన్ ఇన్ఫర్మేషన్, యూసేజ్ స్టాటిస్టిక్స్, వైఫై ఇన్ఫర్మేషన్
‘యూసేజ్ స్టాటిస్టిక్స్’ పై క్లిక్ చేయాలి: ఇక్కడ మీరు Usage Statistics అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. యూసేజ్ స్టాటిస్టిక్స్ లో మీకు ఒక పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఎవరు ఏ యాప్‌లు ఓపెన్ చేశారు, ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎంతసేపు వాడారు అనే వివరాలన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి.
ఏ ఫోన్లలో ఈ ట్రిక్ పని చేస్తుంది?
ఈ కోడ్ ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్లలో పని చేస్తుంది. Samsung, Xiaomi, Realme, Vivo, Oppo, Motorola లాంటి చాలా బ్రాండ్లలో ఇది పనిచేస్తుంది. అయితే, ఐఫోన్లలో ఈ ట్రిక్ పనిచేయదు. కొన్ని కొత్త మోడల్స్ లేదా కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఈ సెట్టింగ్ బ్లాక్ చేసి ఉండొచ్చు, అప్పుడు ఇది పనిచేయకపోవచ్చు. మొత్తానికి, ఫోన్లో ఎవరు ఏం చూశారో తెలుసుకోవాలంటే ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది.
Read Also:Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Apps : మీ పర్సనల్ డేటాను దొంగిలిస్తున్న సోషల్ మీడియా యాప్స్.. టాప్‌లో Metaవే!
-
Mobile Apps: అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి
-
Womens day special: ఉమెన్స్ డే స్పెషల్.. ప్రతీ మహిళ ఫోన్లో ఈ యాప్స్ ఉండాల్సిందే
-
Spouse Secret apps : మీకు తెలియకుండా మీ భాగస్వామి ఏవైనా యాప్స్ ఉపయోగిస్తున్నారా? ఇలా తెలుసుకోండి.