Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం

Mirror: కొందరు ఇంట్లో ప్రతీ విషయంలో కూడా వాస్తు నియమాలు పాటిస్తుంటారు. మరికొందరు అసలు పాటించరు. అయితే ఇంట్లో అద్దం అనేది తప్పనిసరి. డైలీ బయటకు వెళ్లేటప్పుడు అద్దం చూడకుండా అసలు వెళ్లరు. అయితే అద్దం ఇంట్లో మనం పెట్టే దిశను బట్టి మంచి జరుగుతుందట. మంచి దిశలో అద్దం పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందట. లేకపోతే ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. ఇంట్లో సరైన దిశలో అద్దం పెట్టడం వల్ల కుటుంబం సుఖసంతోషాలతో ఉండటంతో పాటు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే ఇంట్లో అద్దాలను ఎక్కడ ఉంచడం మంచిది? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లో అద్దం తూర్పు, ఉత్తర దిశలో పెట్టాలని పండితులు అంటున్నారు. వీటివల్ల సూర్యోదయం నుంచి వచ్చే శక్తి ఇంట్లోకి వస్తుంది. అదే ఉత్తర దిశలో అద్దం ఉంచడం వల్ల డబ్బు వస్తుంది. ఎందుకంటే ఉత్తరదిశ కుబేరుని దిశ. దీనివల్ల ఆర్థికంగా మెరుగుపడతారు. అయితే కొందరు తలుపులకు అద్దాలు పెడతారు. కానీ ఇలా పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందని అంటున్నారు. సాధారణంగా బెడ్‌రూమ్‌లో అద్దం ఉంటుంది. అయితే బెడ్ మీద పడుకున్నప్పుడు అద్దం కనిపించకూడదు. దీనివల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, సమస్యలు, సంతాన సమస్యలు, ఇంట్లో గొడవలు వస్తాయని అంటున్నారు. ఆ సమయంలో అద్దాన్ని గుడ్డతో కప్పడం వంటివి చేయాలి. అయితే కొందరు ఈశాన్య మూల అద్దం పెడుతుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదు. ఇంటికి బయట అసలు అద్దాలు పెట్టకూడదు. అయితే ఇంటి లోపల ద్వారం దగ్గర కుడి లేదా ఎడమ వైపు అద్దాలు పెడితే మంచిదని నిపుణులు అంటున్నారు.
కొందరు ఇంట్లో ప్రతీ ప్లేస్‌లో అద్దాలు పెడతారు. అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా పెడతారు. అయితే ఇలా పెట్టడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుందట. అయితే టాయిలెట్, స్టడీ రూమ్‌లో అద్దాలను తలుపులకు డైరెక్ట్‌గా పెట్టకూడదు. పశ్చిమ లేదా దక్షిణ వైపు పెట్టాలి. కొందరు స్టడీ రూమ్‌లో గోడలకు అద్దాలు పెడతారు. దీనివల్ల ఏకాగ్రత తగ్గుతుందట. ఎప్పుడూ కూడా ఇంట్లో పగిలిన అద్దం ఉండకూడదు. పొరపాటున ఉంటే వెంటనే వాటిని తీసేయండి. వీటివల్ల ఇంట్లో దురదృష్టం వస్తుందట. ఏ పని కూడా సరిగ్గా జరగదు. అన్ని విధాలుగా సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కుబేర దిశలోనే అద్దం పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. డబ్బు వృద్ధి చెందుతుందని, కోటీశ్వరులు అవుతారని అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also read: Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Japan Houses in Air: గాల్లో మేడలు.. ఇవి వట్టి మాటలు కాదండోయ్.. నిజం చేస్తున్న జపాన్!
-
Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?
-
Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు