Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!

Youtube new rules: ప్రస్తుతం రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ కూడా యూట్యూబ్ గురించి తెలుసు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో షార్ట్స్ వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ కూడా వారి సొంతంగా ఒక ఛానెల్ క్రియేట్ చేసుకుని వీడియోలు చేస్తున్నారు. కొందరు వారి సొంత కంటెంట్ ఇస్తే, మరికొందరు కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి యూట్యూబ్ బిగ్ షాక్ తెలిపింది. యూట్యూబ్ కొన్ని కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ మార్పులు అన్ని కూడా జులై 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ ఈ కొత్త రూల్స్‌ను మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ పాటించకపోతే మాత్రం మానిటైజేషన్ కాదు. దీనివల్ల డబ్బులు కూడా రావు. కేవలం ఒరిజినల్ కంటెంట్‌కు మాత్రమే డబ్బులు వస్తాయి. చాలా మంది ఈ రోజుల్లో యూట్యూబ్‌లో మానిటైజేషన్ కోసం ఇతరుల కంటెంట్‌ను కాపీ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే యూట్యూబ్ ఈ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కంటెంట్ ఒరిజినల్ కాకపోయినా, మళ్లీ మళ్లీ ఒకే కంటెంట్ వచ్చినా, ఉపయోగం లేని కంటెంట్ అయినా కూడా మానిటైజేషన్ కాదు. కొత్త రూల్ ప్రకారం కాపీ కంటెంట్‌ను ఎడిట్ చేయకుండా వాడితే మాత్రం అసలు మానిటైజేషన్ కాదు. కొందరు ఏఐతో వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి వారికి అసలు మానిటైజేషన్ అసలు కాదు. దీనివల్ల ఎలాంటి ఆదాయం కూడా రాదు.
సొంత కంటెంట్‌తో పాటు థంబ్ నెయిల్స్, ఫిల్టర్లు అన్ని గమనించిన తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది. ఒకప్పుడు అయినంత సింపుల్‌గా అయితే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ కాదు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ఆధారంగా ఒరిజినల్ కంటెంట్‌ను ఫిల్టర్ చేస్తారు. ఈ రూల్స్ అన్ని కూడా జులై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఈ కొత్త ఒరిజినల్ కంటెంట్ చేసే వారికి ఎలాంటి ప్రభావం చూపదు. కానీ ఏఐ, ఆటోమేషన్ టూల్స్ ద్వారా చేసే వారికి ఎఫెక్ట్ చూపిస్తుంది. కొందరు ఇతరుల కంటెంట్ తీసుకుని తక్కువగా ఎడిట్ చేస్తారు. అలాంటి వారికి తప్పకుండా బిగ్ షాక్ తగిలినట్లే. వీరికి అసలు ఛానెల్ మానిటైజేషన్ కూడా కాదు. సబ్స్క్రైబర్లను ఆకర్షించే విధంగా ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. అప్పుడే డబ్బులు కూడా వస్తాయి. కొందరు వ్యూస్ కోసం ఎలాంటి కంటెంట్ పడితే అవి అప్లోడ్ చేస్తుంటారు. కానీ ఇలా ఉండకూడదు. నవ్వించే విధంగా, ఉపయోగపడే విధంగా కంటెంట్ ఉండాలి. కంటెంట్ క్రియేటర్లు అందరూ కూడా తమ కంటెంట్‌ను ఒరిజినల్‌గా ఉంచితేనే మానిటైజేషన్ అయి డబ్బులు వస్తాయి. అంతే కానీ కాపీ పేస్ట్ చేస్తే అసలు డబ్బులు రావని తెలిపింది. యూట్యూబ్ ఈ కొత్త రూల్ వల్ల క్రియేటర్లకు పెద్ద సమస్య వచ్చిందనే చెప్పవచ్చు. దీనివల్ల వారు ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. వీరి ఛానెల్లో కూడా నాణ్యమైన కంటెంట్ ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి. లేకపోతే అసలు రావు. కాబట్టి అందరూ కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా కంటెంట్‌ను క్రియేట్ చేసుకోవడం ఉత్తమం.
Also read: SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!
-
YouTube : యూట్యూబ్ కొత్త రూల్స్.. కాపీ పేస్ట్ వీడియోలకు డబ్బులు కట్.. జులై 15 నుంచి అమలు
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?