YouTube : యూట్యూబ్ కొత్త రూల్స్.. కాపీ పేస్ట్ వీడియోలకు డబ్బులు కట్.. జులై 15 నుంచి అమలు

YouTube : యూట్యూబ్‌లో కేవలం కాపీ-పేస్ట్ వీడియోలు చేస్తూ లేదా ఒకే రకమైన వీడియోలను అప్లోడ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారా? అయితే ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ జూలై 15, 2025 నుండి తన మోనటైజేషన్ పాలసీలో భారీ మార్పులు తీసుకురాబోతోంది. ఇకపై పదే పదే ఒకే రకమైన, తక్కువ క్వాలిటీతో కూడిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలను అప్లోడ్ చేసే క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఒరిజినల్ ఆసక్తికరమైన కంటెంట్ మాత్రమే ఉండాలని కోరుకుంటోంది. అందువల్ల, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో భాగంగా, రిపీట్ అయ్యే, భారీ మొత్తంలో తయారుచేసిన కంటెంట్‌ను మరింత కఠినంగా పరిశీలించనున్నారు.
కొత్త పాలసీలో ముఖ్యమైన విషయాలు
ఒరిజినాలిటీ ముఖ్యం: ఎవరైనా వేరొకరి కంటెంట్‌ను తీసుకుని కొద్దిగా మార్చడం ఇకపై కుదరదు. వీడియోను పూర్తిగా మార్చి, అది కొత్తగా, మీ సొంత కంటెంట్‌గా కనిపించేలా ఉండాలి.
Read Also:Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు
రిపెటిటివ్ వీడియోలకు అడ్డుకట్ట: పదే పదే ఒకేలాంటి టెంప్లేట్లతో తయారుచేసిన వీడియోలు, రోబోట్ లాంటి వాయిస్‌లు, ఎలాంటి సరైన సమాచారం లేదా ఎంటర్ టైన్మెంట్ లేని వీడియోలను ఇకపై గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటారు. యూట్యూబ్ నేరుగా AI పేరు చెప్పకపోయినా, హ్యుమన్ టచ్ లేని AI వీడియోలు కూడా ఈ కొత్త నిబంధనల పరిధిలోకి వస్తాయని భావిస్తున్నారు. ఉదాహరణకు, ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే వాయిస్‌లు లేదా కేవలం రియాక్షన్లతో కూడిన వీడియోలు వంటివి ఈ నిబంధనల బారిన పడొచ్చు.
డబ్బు సంపాదించాలంటే క్వాలిటీ, క్రియేటివిటీ కావాల్సిందే
యూట్యూబ్‌లో డబ్బు సంపాదించడానికి సాధారణంగా 1000 సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైమ్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అవసరం. అయితే, ఇప్పుడు వీటితో పాటుగా కంటెంట్ ఒరిజినల్, క్వాలిటీది అయితేనే డబ్బులు వస్తాయి. యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక క్లియర్ మెసేజ్ వస్తుంది. యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించాలంటే, కచ్చితంగా కష్టపడాలి. కాపీ-పేస్ట్, క్లిక్‌బైట్, బాట్ లాంటి వీడియోలు ఇకపై ఎక్కువ రోజులు చెల్లవు.
Read Also:Zodiac signs: శని తిరోగమనం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి కష్టకాలం
క్రియేటర్లపై ప్రభావం, ప్రేక్షకులకు లాభం
ఈ మార్పు వల్ల వేలాది మంది క్రియేటర్ల సంపాదనపై ప్రభావం పడవచ్చు. అయితే, యూట్యూబ్ చూసే ప్రేక్షకులకు మాత్రం చాలా మంచి ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. వారికి పదే పదే ఒకేలాంటి బోరింగ్ కంటెంట్ చూడాల్సిన అవసరం ఉండదు. ఇది క్వాలిటీ కంటెంట్‌ను ప్రోత్సహిస్తుంది.
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!
-
YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Viral Video : మురికి నీటిలో పడుకొని డ్యాన్స్ చేసిన యువతి.. ఛీ రీల్స్ కోసం ఇంతలా దిగజారాలా ?
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్