Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!

Cab Charges : రోజు ఆఫీసుకు క్యాబులలో ప్రయాణిస్తుంటారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. త్వరలో క్యాబ్ ఛార్జీలు 200శాతం పెరగున్నట్లు తెలుస్తోంది. రద్దీ సమయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు ఇప్పుడు బేస్ ఛార్జీ పై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్ ఛార్జీని వసూలు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలు ప్రయాణికుల జేబుపై భారీగా భారం పడనుంది. తాజా నిబంధనల ప్రకారం, క్యాబ్ అగ్రిగేటర్లైన ఓలా, ఊబర్ వంటి సంస్థలకు శుభవార్త అందింది. రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్ ఛార్జీని వసూలు చేసుకునేందుకు వారికి ఇప్పుడు అనుమతి లభించింది. గతంలో ఈ పరిమితి 150 శాతంగా మాత్రమే ఉండేది. అంటే, ఇప్పుడు క్యాబ్ సంస్థలు మరింత ఎక్కువ డబ్బు వసూలు చేసుకునే అవకాశం ఉంది.
సాధారణ రద్దీ సమయాల్లో కూడా బేస్ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. దీనివల్ల క్యాబ్ డ్రైవర్లకు, సంస్థలకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యలు డ్రైవర్లకు ప్రోత్సాహాన్ని అందించి, ఎక్కువ మందిని డ్రైవింగ్ వైపు ఆకర్షించవచ్చని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. అయితే, ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక షరతు విధించింది. మూడు కిలోమీటర్లలోపు చేసే ప్రయాణాలపై ఎలాంటి అదనపు సర్జ్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ఇది తక్కువ దూరం ప్రయాణించే వారికి, ముఖ్యంగా దగ్గరి ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపశమనం కలిగించే అంశం. ఈ నిబంధన వల్ల చిన్న ప్రయాణాలకు అధిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఈ కొత్త నిబంధనలు క్యాబ్ సంస్థలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చనుండగా, రద్దీ వేళల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై ఛార్జీల భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక క్యాబ్ బేస్ ఛార్జీ రూ.100 అనుకుంటే, 200 శాతం సర్జ్ ఛార్జీతో అది రూ.300 అవుతుంది. ఇది ప్రయాణికులకు అదనపు వ్యయంగా మారుతుంది. క్యాబ్ సంస్థలు తాము ఎదుర్కొంటున్న మెయింటెనెన్స్ ఖర్చులు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు, ఇంధన ధరల పెరుగుదల వంటి కారణాలను చూపుతూ సర్జ్ ఛార్జీల పెంపును చాలా కాలంగా కోరుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని అందించి తద్వారా క్యాబ్‌ల లభ్యతను పెంచుతాయని భావిస్తున్నారు.
అయితే, ప్రయాణికుల వైపు నుంచి చూస్తే రద్దీ సమయాల్లో క్యాబ్‌ల వినియోగం ఖరీదైనదిగా మారిపోతుంది. దీనివల్ల ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ మార్పులు క్యాబ్ ఇండస్ట్రీ పై ప్రభావం చూపుతాయో చూడాలి. ఈ నిబంధనలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలకు వర్తిస్తాయా లేదా అనేది కూడా స్పష్టం కావాల్సి ఉంది.
Read Also:Sridevi : చేసింది ఒక్క సినిమానే.. కొత్త కారు కొన్న జాబిలి.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే ?
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే