Jabardasth Sunny : కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ సన్నీ జీవితంలో ఇంత విషాదమా ? ప్రేమించిన అమ్మాయి కోసం ఇంతలా..

Jabardasth Sunny : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టీవీ షోలలో జబర్దస్త్ ముందుంటుంది. సినిమాల కంటే ఎక్కువగా పాపులర్ అయిన ఈ షో, ఎంతో మంది కమెడియన్లను పరిచయం చేసింది. కొందరు హీరోలుగా, దర్శకులుగా మారి మెప్పిస్తుంటే, మరికొందరు జబర్దస్త్‌లోనే ఉంటూ తమ స్కిట్స్‌తో నవ్విస్తున్నారు. అలాంటి వారిలో సన్నీ ఒకరు. సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఉంటూ తన కామెడీతో ప్రేక్షకులను సన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాడు.
నవ్వులు, పంచ్‌లతో ప్రేక్షకులను అలరించే సన్నీ జీవితంలో ఒక పెద్ద విషాదం ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. సన్నీ ఎక్కువగా తాగుబోతు పాత్రలు వేసి నవ్విస్తుంటాడు. కానీ నిజానికి, అతని జీవితంలో ఒక చేదు నిజం ఉంది. కోట్లు సంపాదించి, మంచి ఆస్తులు ఉన్నప్పటికీ సన్నీ ఒక అమ్మాయి కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకున్నాడు. ఇంకా ఆమెనే తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు. ఈ విషయాన్ని సన్నీ స్వయంగా జబర్దస్త్ ఎపిసోడ్‌లో చెప్పాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో, ప్రేమ, పెళ్లి పట్ల నమ్మకం కోల్పోయి సన్నీ ఒంటరిగా ఉండిపోయాడు.
Read Also:Sridevi : చేసింది ఒక్క సినిమానే.. కొత్త కారు కొన్న జాబిలి.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే ?
జబర్దస్త్ ఎపిసోడ్‌లో యాంకర్ రష్మి సన్నీని నీ లవ్ స్టోరీ ఏంటి ఎందుకింకా పెళ్లి చేసుకోలేదని అడిగింది. దానికి సన్నీ బదులిస్తూ.. “నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎనిమిదేళ్లుగా మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకుంది. తను గవర్నమెంట్ ఎంప్లాయి కావడం వల్లే వల్లే అతడిని పెళ్లి చేసుకుంది” అని ఆవేదనతో చెప్పాడు. పక్కనే ఉన్న మరో కమెడియన్ రామ్ ప్రసాద్ కలుగజేసుకుని, “సన్నీ నిజంగా కోటీశ్వరుడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. కానీ సన్నీ లవ్ ఫెయిల్ అయి, పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని వదిలేసుకున్నాడు. సన్నీ అన్న, చెల్లి ఇద్దరూ డాక్టర్లు. అంత డబ్బున్నా వాళ్ళ ఇంట్లో ఉండడు. మా రూమ్‌లకి వచ్చి తాగి పడుకుంటాడు. ఆ అమ్మాయి కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు” అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంతటి విషాదం ఉందని తెలిసి అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు.