Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు

Jabardasth Nukaraju: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు హీరోలుగా రాణిస్తుంటే.. ఇంకొందరు సినిమాలో కమెడియన్లుగా కొనసాగుతున్నారు. ఇంకొందరు బుల్లితెర షోలతో పాటు యూట్యూబులో షార్ట్స్, వీడియోలు, బ్లాగ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో తమ సత్తా చాటుతున్నారు. జబర్దస్త్, పటాస్ వంటి ప్రోగ్రామ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన జోడీ నూకరాజు, ఆసియా. టీవీలో బాగా పాపులర్ అయిన ఈ జంట తెరపై చూపించిన కెమిస్ట్రీకి చాలా మంది ఫిదా అయ్యారు. వీళ్ళిద్దరూ నిజ జీవితంలో కూడా కలిసే ఉన్నారని చాలా మంది అనుకున్నారు, కొన్నిసార్లు అనుమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నూకరాజు ఓ కొత్త పాట ఈ జోడీ గురించి మరో చర్చకు దారితీసింది.
జబర్దస్త్ నూకరాజు కామెడీతో పాటు పాటలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల నూకరాజు పాడిన తాటి బెల్లం పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ తర్వాత నూకరాజు మరో కొత్త పాటతో మన ముందుకు వచ్చాడు.
జబర్దస్త్ బాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సల్లగుండరాదే’ పాట ప్రోమో తాజాగా విడుదలైంది. అయితే, ఈ పాటలో ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. ఈ పాటలో ఆసియాకు వేరే అబ్బాయితో పెళ్లి అవుతుంది. గతంలో ఆసియాని ప్రేమించిన నూకరాజు, ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతాడు.
పాటలో నూకరాజు, ఆసియాను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ వీడియో చూసిన వారంతా చాలా ఎమోషనల్ అవుతున్నారు. “ఇదంతా పాట కోసమే కదా, కానీ నిజ జీవితంలో ఇలా జరిగితే మేము తట్టుకోలేం” అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు, ఈ పాటను డైరెక్ట్ చేసిన ‘జబర్దస్త్’ బాబుకు అభినందనలు తెలుపుతూ, ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.
Read Also:Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ