Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
Eng Vs Ind 4th Test ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తుంది. ఇంగ్లాండ్ కూడా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.

Eng Vs Ind 4th Test: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ భారత్ కు కీలకం కానుంది. మాంచెస్టర్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ భారత్ కు చాలా కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తుంది. ఇంగ్లాండ్ కూడా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు స్వల్ప మార్పులతో బరిలోకి దిగనుంది. చేతివేలి గాయం కారణంగా మిగతా రెండు టెస్ట్ లకు స్పిన్నర్ సోషబ్ బషీర్ దూరం కానున్నాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత స్పిన్నర్ లియామ్ డాసన్ జట్టులోకి తీసుకున్నారు.
అయితే భారత్ కూడా మార్పులు చేయవల్సిన సమయం వచ్చింది. విదేశీ గడ్డపై గత మూడు మ్యాచ్ లలో కరుణ్ నాయర్ విఫలం అయ్యాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాని అతడు వినియోగించుకోలేక పోయాడు. దీంతో కరుణ్ నాయర్ ను తప్పించి సాయి సుదర్శన్ ను తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2-1 తో ఇంగ్లాండ్ జట్టు భారత్ పై ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో ఏ ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాకుండా విజయంతో ముగించాయి. దీంతో నాలుగో టెస్ట్ భారత్ కు ఎంతో కీలకం కానుంది.
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Rishabh Pant: దేశం కోసం గెలవండి.. రిషబ్ పంత్ ఆసక్తికర ట్వీట్
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Eng Vs Ind 4th Test: పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తాడా…