Viral Video : మురికి నీటిలో పడుకొని డ్యాన్స్ చేసిన యువతి.. ఛీ రీల్స్ కోసం ఇంతలా దిగజారాలా ?

Viral Video : ఇంటర్నెట్లో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కొందరు విచిత్రమైన, అడ్డమైన పనులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు సీమా కనౌజియా అనే ఈ కంటెంట్ క్రియేటర్‌నే చూడండి. తన రీల్‌కు లైక్‌లు, కామెంట్లు సంపాదించుకోవాలనే కోరికతో వర్షం తర్వాత మురికి నీటితో నిండిన రోడ్డుపై ఆమె లోటాలో పడుకుని డాన్స్ చేసింది. అటుగా వెళ్తున్న వారు కూడా ఇది చూసి ఆశ్చర్యపోయారు.
ఈ సంఘటన ముంబైలోని ఏదో ఒక బిజీ రోడ్డులో జరిగింది. అక్కడ వర్షం పడటంతో రోడ్డు మొత్తం మురికి నీటితో నిండి ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో, సీమా ఆ మురికి నీటిలోకి వెళ్లి తన ఇంట్లో ఏదో లగ్జరీ స్విమ్మింగ్ పూల్ అనుకున్నట్లుగా పడుకుని డాన్స్ చేస్తోంది. ఆమె ఈ వింత ప్రవర్తనను చూసి అటుగా వెళ్తున్న పాదచారులు, బైక్ నడిపే వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ యువతి అసలు ఏమి చేస్తోందని ఆలోచనలో పడ్డారు.
Read Also:Phone Security : పిన్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్.. మీ ఫోన్‌కు ఏది ఎక్కువ సేఫ్?
View this post on Instagram
వీడియోలో చూస్తే సీమా మురికి నీటిలో పడుకుని అటూ ఇటూ దొర్లుతూ, ‘ఛపాక్-ఛపాక్’ అంటూ డాన్స్ చేస్తుండగా, అటుగా వెళ్తున్న చాలా మంది వాహనదారులు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ విచిత్రమైన రీల్‌ను చూసిన నెటిజన్లు చాలా మంది సీమా కనౌజియా ప్రవర్తనను సోషల్ మీడియాలో వింత, వివాదాస్పద కంటెంట్ కోసం మరీ ఇంతలా దిగజారాలా అని కామెంట్ చేస్తున్నారు. కొందరు అయితే ఆమెను పునీత్ సూపర్‌స్టార్‌తో పోల్చారు.
కొందరు యూజర్లు సరదాగా ఆమెను పునీత్ సూపర్‌స్టార్ సోదరి అని కూడా అంటున్నారు. ఎందుకంటే, పునీత్ కూడా లైక్‌లు, వ్యూస్‌ల కోసం విచిత్రమైన పనులు చేస్తూ కనిపించారు. కొన్నిసార్లు ఆయన మురుగునీటిలో నిమ్మరసం కలిపి తాగడం, కొన్నిసార్లు ముఖానికి పేడ పూసుకుని కెమెరా ముందు కనిపించడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి.
సీమా కనౌజియా ముంబైకి చెందిన వ్యక్తి. ఆమె బహిరంగ ప్రదేశాల్లో ఇలా విచిత్రంగా డాన్స్ చేసి ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @seemakanojiya87 పేరుతో ఆమెకు 8.5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఈ రీల్ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు దీనిని చవకబారు పబ్లిసిటీ కోసం చేసే లో లెవల్ పనిగా అభివర్ణిస్తున్నారు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
YouTube : యూట్యూబ్ కొత్త రూల్స్.. కాపీ పేస్ట్ వీడియోలకు డబ్బులు కట్.. జులై 15 నుంచి అమలు