Tecno Pova Curve 5G :16GB ర్యామ్, AI ఫీచర్స్‌తో టెక్నో పోవా కర్వ్ 5G వచ్చేసింది.. వన్‌ప్లస్, వివోలకు గట్టి పోటీ!

Tecno Pova Curve 5G : టెక్నో (Tecno) కంపెనీ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త టెక్నో పోవా కర్వ్ 5G (Tecno Pova Curve 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh పవర్ ఫుల్ బ్యాటరీతో వచ్చింది. అంతేకాకుండా, ఈ ఫోన్‌లో AI కాల్ అసిస్టెంట్ వంటి అనేక ప్రత్యేకమైన AI ఫీచర్లు కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ (OnePlus), వివో (Vivo) వంటి బ్రాండ్‌లకు గట్టి పోటీనిచ్చే ఈ ఫోన్ ధర ఎంత? దీని ప్రత్యేకతలు ఏమిటి? వివరంగా తెలుసుకుందాం.
టెక్నో పోవా కర్వ్ 5G: ఫీచర్లు, ధర వివరాలు!
డిస్‌ప్లే:
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ HD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, వీడియో చేసే వాళ్లకు ఇది అద్భుతమైన అనుభూతినిస్తుంది.
ప్రాసెసర్:
స్పీడ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది రోజూవారీ పనులు, గేమింగ్‌ను సులభంగా నిర్వహించగలదు.
Read Also:Admissions at IIIT Basara: ఐఐఐటీ బాసరలో ప్రవేశాలు.. విద్యార్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే?
ర్యామ్:
ఫోన్‌లో 8GB ర్యామ్ తో పాటు 8GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీని సహాయంతో మీరు మొత్తం ర్యామ్‌ను 16GB వరకు సులభంగా పెంచుకోవచ్చు. ఇది యాప్‌లు, మల్టీటాస్కింగ్‌ను మరింత స్మూత్‌గా చేస్తుంది.
కెమెరా:
ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది మంచి క్వాలిటీ గల ఫోటోలను తీయడానికి సహాయపడుతుంది. సెల్ఫీ ప్రియుల కోసం ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది.
బ్యాటరీ:
ఈ ఫోన్‌కు పవర్ అందించడానికి 5500 mAh పవర్ ఫుల్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ బ్యాటరీ 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి కేవలం 45 నిమిషాలు పడుతుంది.
Read Also:How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
టెక్నో పోవా కర్వ్ 5G ధర :
* ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. అదే విధంగా, 8GB ర్యామ్/128GB స్టోరేజ్ టాప్ వేరియంట్ కొనడానికి రూ. 16,999 ఖర్చవుతుంది. ఈ ఫోన్ జూన్ 5 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్, వివో, మోటరోలా, నథింగ్‌లకు సవాల్!
ఈ ధరల విభాగంలో టెక్నో బ్రాండ్ ఈ స్మార్ట్‌ఫోన్ Vivo T4x 5G, Motorola G85 5G, Nothing Phone 1, OnePlus Nord CE4 Lite 5G వంటి ఫోన్‌లకు గట్టి పోటీనివ్వనుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ముఖ్యంగా 16GB ర్యామ్, AI ఫీచర్లతో ఇది మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది.