Motorola : రూ.15వేలకే అదిరిపోయే ఫీచర్స్.. మోటోరోలా కొత్త ఫోన్ వచ్చేస్తోంది

Motorola : మోటోరోలా వచ్చే నెలలో తమ కొత్త మిడ్-రేంజ్ ఫోన్ మోటో జీ96 5జీను ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని మోటోరోలానే X లో పోస్ట్ చేసి ధృవీకరించింది. జూలై 9, 2025న మోటో జీ96 5జీ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 5జీ స్పీడ్, అద్భుతమైన డిస్ప్లే, పవర్ఫుల్ కెమెరాతో వస్తోంది. మోటోరోలా ఈ అద్భుతమైన ఫోన్‌ను 12జీబీ ర్యామ్, 50ఎంపీ కెమెరా, 144హెచ్‌జెడ్ డిస్ప్లేతో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. మోటోరోలా యాష్లీ బ్లూ, కాటలియా ఆర్చిడ్, డ్రెస్డెన్ బ్లూ, గ్రీనర్ పాశ్చర్స్ వంటి రంగులలో మోటో జీ96 5జీ ఫోన్‌ను అందిస్తుంది. లాంచ్‌కు ముందు ఫోన్ అంచనా ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Read Also:Rishabh Pant Backflip: బ్యాక్‌ఫ్లిప్ నీకంత అవసరమా.. రిషబ్ పంత్‌కు డాక్టర్ క్లాస్
మోటో జీ96 5జీ అంచనా ధర రూ. 15,000 నుండి రూ. 20,000 మధ్య ఉండొచ్చని టిప్స్టర్లు చెబుతున్నారు. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్లో దీన్ని ఒక మంచి ఆప్షన్‌గా నిలుపుతుంది. లాంచ్ ఆఫర్‌గా ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభించే అవకాశం ఉంది. మోటో జీ96 5జీ ఫోన్లో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇది 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్, బ్రైట్ అనుభవాన్ని ఇస్తుంది. ఇది వాటర్ టచ్ 2.0 టెక్నాలజీతో రావచ్చని అంచనా. దీనివల్ల తడి చేతులతో కూడా పని చేస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఫోన్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. 144హెచ్‌జెడ్ డిస్ప్లే గేమింగ్, వీడియోల కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే 50ఎంపీ కెమెరా కూడా ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ.
Read Also:Mango Peel : తొక్కే కదా తీసేస్తున్నారా.. మామిడి తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్ తో రావచ్చని అంచనా, ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఫాస్టుగా పని చేస్తుంది. మోటో జీ96 5జీ ఫోన్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి, ఇవి పగలు, రాత్రి అద్భుతమైన ఫోటోలను తీస్తాయి. ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది. ఫోన్ ఐపీ54 రేటింగ్, స్టీరియో స్పీకర్లు, 5జీ కనెక్టివిటీతో కూడా వస్తుందని భావిస్తున్నారు.
-
Tecno Pova Curve 5G :16GB ర్యామ్, AI ఫీచర్స్‌తో టెక్నో పోవా కర్వ్ 5G వచ్చేసింది.. వన్‌ప్లస్, వివోలకు గట్టి పోటీ!
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!
-
Motorola: మోటారోలా నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు
-
Gaming Mobiles: తక్కువ బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!