Infinix : సిగ్నల్ లేకపోయినా కాల్స్.. బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ నేడే లాంచ్

Infinix : బడ్జెట్ సెగ్మెంట్లో నేడు ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ నేడు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయింది. అధికారిక లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్లో లభించే కొన్ని ప్రత్యేకతల గురించి చెప్పుకొచ్చింది. ఇందులో వన్ ట్యాప్ ఏఐ బటన్, గేమింగ్ సమయంలో 90 ఫ్రేమ్స్ ప్రతి సెకను, ఏఐ సర్కిల్ టు సెర్చ్ , నెట్వర్క్ లేకుండా కాల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈరోజు విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ క్రియేట్ చేశారు. స్పీడ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ లభిస్తుంది. ఈ చిప్సెట్ ఆన్టూటూ స్కోర్ 500,000 కంటే ఎక్కువ.
Read Also:Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
డ్యూయల్ టోన్ ఫినిష్ డిజైన్‌తో ఈ ఫోన్లో 5200 mAh పవర్ ఫుల్ బ్యాటరీని ఇచ్చారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 12 GB వరకు ర్యామ్, హైపర్ ఇంజిన్ 5.0 లైట్ గేమింగ్ టెక్నాలజీ, ఎక్స్ బూస్ట్ ఏఐ గేమ్ మోడ్, ఏఐ అసిస్టెంట్, 5 సంవత్సరాల వరకు లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ లభిస్తాయి. ఐపీ64 రేటింగ్ ఉన్న ఈ బడ్జెట్ ఫోన్లో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 6.7 అంగుళాల హెచ్డి ప్లస్ రిజల్యూషన్ డిస్ప్లే కూడా లభిస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. అల్ట్రా లింక్ కనెక్టివిటీ ఫీచర్ ఒక ప్రత్యేకమైనది. ఇది ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఫోన్ల మధ్య మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే, మీ దగ్గర ఇన్ఫినిక్స్ ఫోన్ ఉండి, మీ ఫ్రెండ్ దగ్గర కూడా ఇన్ఫినిక్స్ ఫోన్ ఉంటే నెట్వర్క్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు.
Read Also:Children’s Growth : పిల్లల ఆరోగ్యానికి ఏమిటి మంచిది? వారికి వరస్ట్, బెస్ట్ ఆప్షన్లు ఇవే
ధర విషయానికి వస్తే ప్రస్తుతం కంపెనీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఫీచర్లను చూస్తే ఈ ఫోన్‌ను రూ. 15,000 ల మార్క్ చుట్టూ ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఫోన్‌తో పాటు లభించే ఒక అద్భుతమైన ఆఫర్‌ను కూడా లాంచ్‌కు ముందే చెప్పింది. కంపెనీ అధికారిక సైట్ ప్రకారం, ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 2,999 విలువైన ఇన్ఫినిక్స్ బడ్స్ లైట్ ఫ్రీగా అందజేస్తారు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో విడుదలవుతుంది. షెడో బ్లూ, గ్రీన్, బ్లాక్.